Gold Seized : బ్యాండేజీల్లో దాచుకుని బంగారం అక్రమ తరలింపు

రెండు కాళ్లకు గాయాలు తగిలినట్లు బ్యాండేజీలు వేసుకున్న ఓ వ్యక్తి .. గోల్డ్‌ను పేస్ట్‌ రూపంలో ఆ బ్యాండేజీల్లో దాచాడు.

Gold Seized : బ్యాండేజీల్లో దాచుకుని బంగారం అక్రమ తరలింపు

Gold

Updated On : January 11, 2022 / 8:13 AM IST

Hyderabad airport : హైదరాబాద్‌ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రెండు కాళ్లకు గాయాలు తగిలినట్లు బ్యాండేజీలు వేసుకున్న ఓ వ్యక్తి .. గోల్డ్‌ను పేస్ట్‌ రూపంలో ఆ బ్యాండేజీల్లో దాచాడు. దీన్ని గమనించిన అధికారులు.. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 47 లక్షల విలువ చేసే బంగారం సీజ్ చేశారు.

డిసెంబర్ 28, 2021న హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.20.49లక్షల విలువైన 412 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.