Delhi Anjali Case : ఢిల్లీ అంజలి కేసు.. ఆమె మృతికి కారణం ఇదే.. పోలీసుల చేతిలో అటాప్సీ రిపోర్ట్

ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అంజలి అవయవాలకు అంతర్గత గాయాలేవీ లేవని పోస్టుమార్టంలో తేలింది. దీంతో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, ప్రమాదంలోనే ఆమె చనిపోయిందని నిర్దారణ అయ్యింది. అంజలిని అత్యాచారం చేసి చంపారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.

Delhi Anjali Case : ఢిల్లీ అంజలి కేసు.. ఆమె మృతికి కారణం ఇదే.. పోలీసుల చేతిలో అటాప్సీ రిపోర్ట్

Delhi Anjali Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అంజలి అవయవాలకు అంతర్గత గాయాలేవీ లేవని పోస్టుమార్టంలో తేలింది. దీంతో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, ప్రమాదంలోనే ఆమె చనిపోయిందని నిర్దారణ అయ్యింది.
అంజలిని అత్యాచారం చేసి చంపారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. అయితే, మొదటి నుంచి కూడా పోలీసులు ఈ ఆరోపణలను తోసి పుచ్చుతున్నారు. అటు ప్రమాద సమయంలో అంజలితో పాటు ప్రయాణిస్తున్న యువతిని నిధిగా గుర్తించారు పోలీసులు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని నిధి తెలిపింది. ప్రమాదానికి ఆమె ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆమె ఈ కేసులో కీలకంగా మారింది.

Also Read..Delhi: మహిళను ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. మహిళ మృతి

న్యూ ఇయర్ వేడుకలు ముగిసిన తర్వాత రాత్రి 1.45 గంటలకు నిధి హోటల్ నుంచి బయటకు వచ్చింది. వారు బయటకు వస్తున్న దృశ్యాలు సీసీటీవీ రికార్డ్ అయ్యాయి. హోటల్ నుంచి ఇద్దరూ స్కూటీపై బయలుదేరారు. మొదటి నిధి డ్రైవ్ చేసింది. తర్వాత అంజలి డ్రైవ్ చేసింది. ఆమె డ్రైవింగ్ చేస్తుండగానే.. స్కూటీని కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టగానే నిధి బైక్ పైనుంచి కిందకు పడింది.

ఈ ప్రమాద ఘటనతో భయపడిపోయిన నిధి అక్కడి నుంచి పారిపోయింది. అయితే, అంజలి కాలు కారు యాక్సిల్ లో చిక్కుకుపోవడంతో వాహనం ఆమెను ఈడ్చుకుపోయింది. పోలీసు కేసులు, విచారణ భయంతోనే తాను పారిపోయినట్లు నిధి చెప్పింది.

Also Read..Karimnagar Death Mystery : అంతుచిక్కని వ్యాధీ కాదు, చేతబడీ కాదు.. కరీంనగర్‌లో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు..!

ఎదురుగా వస్తున్న కారు తమను ఢీకొట్టిందని, అంజలి కాలు కారు యాక్సెల్ లో చిక్కుకుపోవడం తాను చూశానని నిధి తెలిపింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఐదుగురు నిందితులు.. తమ వాహనం ఓ యువతిని ఈడ్చుకుపోతున్న విషయం తమకు తెలియదని చెబుతున్నారు. ఆ సమయంలో తాము మద్యం మత్తులో ఉన్నామని వారు అంగీకరించారు.

స్కూటీని ఢీకొట్టిన తర్వాత కూడా కారు వేగంగా దూసుకుపోయింది. ఓ కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత డ్రైవింగ్ చేస్తున్న దీపక్.. కారుకి ఏదో చిక్కుకుని ఉందని అన్నా.. మిగిలిన వాళ్లు తోసిపుచ్చారు. దీంతో అతడు కారుని అలాగే వేగంగా డ్రైవ్ చేశాడు. కారు సుల్తాన్ పూర్ నుంచి 14 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కంజువాలా యూటర్న్ దగ్గరికి చేరుకున్నప్పుడు దీపక్ పక్కనే కూర్చున్న మిధున్.. కారు కింద ఓ చేయి ఉన్నట్టు చూశాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వెంటనే కారుని ఆపారు. యువతి శరీరం కారు నుంచి కిందకు పడింది. వెంటనే వారు కారు నుంచి కిందకు దిగారు. యువతిని కాపాడే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి పారిపోయారు. యువతిని కారు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కారులోని వాళ్లకు ఈ విషయం చెప్పేందుకు స్కూటర్ పై వారిని వెంబడించాడు.

కానీ, కారు వేగాన్ని అందుకోలేకపోయాడు. అంజలిని కారు ఈడ్చుకెళ్లిన 14 కిలోమీటర్ల పరిధిలోని 400 సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రోహిణి హోటల్ లో అంజలి, నిధితో కలిసి న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్న ముగ్గురు అబ్బాయిలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.