Ap Government : ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఈసీ బ్రేక్

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈసీ పర్మిషన్ అడుగుతూ కొన్నిరోజుల క్రితం లేఖ రాసింది జగన్ సర్కార్.

Ap Government : ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఈసీ బ్రేక్

Ap Government : ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఈసీ బ్రేక్ వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమ చేయొద్దని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఈసీ.

తుపాను, కరవు కారణంగా నష్టపోయిన రైతులకు అందే ఇన్ పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయకూడదని ఆదేశించింది. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా ప్రస్తుతానికి ఆపేయాలంటూ లేఖ విడుదల చేసింది. విద్యార్థులకు విద్యాదీవెన కింద రూ.610 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదలకు ఈసీ నో చెప్పింది. ప్రతి 3 నెలలకోసారి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎన్నికల నెపంతో ఇప్పుడు ఆ డబ్బు విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. అడ్మిషన్లు, చదువుల వేళ ఈసీ నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

గత ఐదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలు.. చేయూత, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీ.. ఈ మూడు పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈసీ పర్మిషన్ అడుగుతూ కొన్నిరోజుల క్రితం లేఖ రాసింది జగన్ సర్కార్. దీనిపై తాజాగా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఆ మూడు పథకాల అమలు ఆపేయాలని, లబ్దిదారులకు నిధులు జమ చేయొద్దని ఈసీ ఆదేశించింది. దీంతో ఈ మూడు పథకాల అమలుకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చేది లేదని ఈసీ తేల్చి చెప్పింది. దీంతో మహిళలు, విద్యార్థులు, రైతులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.

Also Read : ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోంది: అధికారుల బదిలీపై జగన్ సంచలన కామెంట్స్