Delhi: మహిళను ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. మహిళ మృతి

ఆదివారం అర్ధరాత్రి 03.00 గంటల సమయంలో ఢిల్లీ సుల్తాన్‌పురి ప్రాంతంలో అంజలి స్కూటీపై వెళ్తుండగా ఒక కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె కారు చక్రంలో ఇరుక్కుంది. అయినప్పటికీ ఆ కారును ఆపకుండా అందులోని వ్యక్తులు అలాగే లాక్కెళ్లారు.

Delhi: మహిళను ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. మహిళ మృతి

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒక మహిళను ఢీకొన్న కారు ఆమెను 12 కిలోమీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, అమన్ విహార్ ప్రాంతానికి చెందిన అంజలి అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటోంది.

Telangana: పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు

ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి స్కూటీపై బయటకు వెళ్లింది. రాత్రి పది గంటలకల్లా తిరిగొస్తానని చెప్పింది. ఆ కుటుంబానికి ఆమే జీవనాధారం. అయితే, ఆదివారం అర్ధరాత్రి 03.00 గంటల సమయంలో ఢిల్లీ సుల్తాన్‌పురి ప్రాంతంలో అంజలి స్కూటీపై వెళ్తుండగా ఒక కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె కారు చక్రంలో ఇరుక్కుంది. అయినప్పటికీ ఆ కారును ఆపకుండా అందులోని వ్యక్తులు అలాగే లాక్కెళ్లారు. అలా ఆమెను 12 కిలోమీటర్లు లాక్కెళ్లారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, కారు ఆ మహిళను లాక్కెళ్లడం స్థానికులు చూసి అర్ధరాత్రి 03.24 నిమిషాలకు పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం ఉదయం నాలుగు గంటల సమయంలో మహిళ మృతదేహం రోడ్డు పక్కన పడి ఉందని మరికొందరు పోలీసులకు సమాచారం అందించారు.

Srivari Vaikuntha Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్థానిక సోషల్ మీడియాలో కూడా దీనిపై ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో నిజం లేదని పోలీసులు తెలిపారు. మృతురాలిపై అత్యాచారం జరగలేదని పోలీసులు అన్నారు.