Telangana: పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17,560 ఉద్యోగాల్ని టీఎస్ఎల్‌‌పీఆర్‌బీ భర్తీ చేయనుంది. గత నెల 8 నుంచి చేపట్టిన ఫిజికల్ టెస్టులు ఈ నెల 5తో ముగుస్తాయి. దీంతో తుది రాత పరీక్షలకు బోర్డు సిద్ధమవుతోంది.

Telangana: పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు

Telangana: తెలంగాణలో యునిఫామ్ సర్వీసెస్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించి తుది పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సివిల్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ ఎస్ఐతోపాటు ఎక్సైజ్, రవాణా తదితర విభాగాల ఉద్యోగాల తుది పరీక్షల్ని మార్చి 12 నుంచి నిర్వహించనున్నారు.

Numaish: నాంపల్లి ఎగ్జిబిషన్ నేడే ప్రారంభం.. 46 రోజులపాటు సాగనున్న నుమాయిష్

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17,560 ఉద్యోగాల్ని టీఎస్ఎల్‌‌పీఆర్‌బీ భర్తీ చేయనుంది. గత నెల 8 నుంచి చేపట్టిన ఫిజికల్ టెస్టులు ఈ నెల 5తో ముగుస్తాయి. దీంతో తుది రాత పరీక్షలకు బోర్డు సిద్ధమవుతోంది. ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే హాల్ టిక్కెట్లు కూడా జారీ చేస్తారు. అలాగే డ్రైవర్ పోస్టులకు అర్హులైన వారికి, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే వివరాల్ని కూడా బోర్డు త్వరలోనే విడదుల చేస్తుంది. కాగా, తుది పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాల్లో ప్రధానమైంది సివిల్ ఎస్ఐ.

Telangana DGP: కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించి.. మ‌హేంద‌ర్ రెడ్డితో కలిసి కేసీఆర్ వద్దకు అంజనీ కుమార్

ఈ ఉద్యోగానికి సంబంధించిన రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తారు. మార్చి 23న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఉదయం ఎస్ఐ అభ్యర్థులకు, మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్స్ విభాగంలో ఏఎస్ఐ పోస్టులకు, మార్చి 26న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్సై పోస్టులకు, ఏప్రిల్ 2న ఉదయం డ్రైవర్లు, డ్రైవర్ ఆపరేటర్స్ (కానిస్టేబుల్స్), మధ్యాహ్నం మెకానికల్ (కానిస్టేబుల్) పోస్టులకు, ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ఫింగర్ ప్రింట్స్ విభాగాల్లోని పోస్టులకు, ఏప్రిల్ 9న సివిల్, ఇతర విభాగాల ఎస్ఐ పోస్టులకు, ఏప్రిల్ 23న సివిల్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు జరుగుతాయి.