Telangana DGP: కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించి.. మ‌హేంద‌ర్ రెడ్డితో కలిసి కేసీఆర్ వద్దకు అంజనీ కుమార్

తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా ఐదేళ్లపాటు సేవలు అందించిన మ‌హేంద‌ర్ రెడ్డి ఇవాళ ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఏసీబీ డీజీ అంజనీ కుమార్‌ ను రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతల్లో నియ‌మిస్తూ ఇటీవలే సర్కారు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ మహేందర్ రెడ్డి నుంచి అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.

Telangana DGP: కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించి.. మ‌హేంద‌ర్ రెడ్డితో కలిసి కేసీఆర్ వద్దకు అంజనీ కుమార్

DGP of Telangana

DGP of Telangana: తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా ఐదేళ్లపాటు సేవలు అందించిన మ‌హేంద‌ర్ రెడ్డి ఇవాళ ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఏసీబీ డీజీ అంజనీ కుమార్‌ ను రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతల్లో నియ‌మిస్తూ ఇటీవలే సర్కారు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ మహేందర్ రెడ్డి నుంచి అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.

అంజనీ కుమార్ కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్ తో కేసీఆర్ కాసేపు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏపీ క్యాడర్ అధికారి అంజనీ కుమార్ ఉమ్మడి ఏపీలోనూ అనేక కీలక బాధ్యతల్లో కొనసాగిన విషయం తెలిసిందే. ఇవాళ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో నిన్న మహేందర్ రెడ్డిని కేసీఆర్ సన్మానించారు.

కాగా, మొత్తం ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పోలీస్ క‌మిష‌న‌ర్‌ మహేశ్ భగవత్ ను సీఐడీ అడిష‌న‌ల్ డీజీగా నియమించింది. రాచకొండ కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్‌ ను, ఏసీబీ డీజీగా ర‌వి గుప్తాను, తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డీజీగా జితేంద‌ర్ ను, శాంతి భద్రతల అద‌న‌పు డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ ను నియమించింది.

Police Arrest Bairi Naresh : భైరి నరేశ్‌‌కు కఠిన శిక్ష పడేలా చూస్తాం- ఎస్పీ కోటిరెడ్డి