Police Arrest Bairi Naresh : భైరి నరేశ్‌‌కు కఠిన శిక్ష పడేలా చూస్తాం- ఎస్పీ కోటిరెడ్డి

మత విద్వేశాలను రెచ్చగొడితే ఉపేక్షించేది లేదన్న ఎస్పీ.. భైరి నరేశ్ గతంలో కూడా చట్ట వ్యతిరేక పనులు చేశాడని చెప్పారు. నరేశ్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

Police Arrest Bairi Naresh : భైరి నరేశ్‌‌కు కఠిన శిక్ష పడేలా చూస్తాం- ఎస్పీ కోటిరెడ్డి

Police Arrest Bairi Naresh : అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేశ్ ను వికారాబాద్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. భైరి నరేశ్ తో పాటు ఆ రోజు ప్రోగ్రామ్ నిర్వహించిన డోలు హనుమంతును కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని కూడా రిమాండ్ కు తరలించారు. తమకు ఫిర్యాదు అందిన 24 గంటల్లో నరేశ్, హనుమంతును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ఈ నెల 19న వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో నాస్తిక సంఘం మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో భైరి నరేశ్ హిందూ దేవుళ్లతో పాటు అయ్యప్పను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. దాని పైనే అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్న ఎస్పీ.. ఇతరుల మనోభావాలు, విశ్వాసాలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మత విద్వేశాలను రెచ్చగొడితే ఉపేక్షించేది లేదన్న ఎస్పీ.. భైరి నరేశ్ గతంలో కూడా చట్ట వ్యతిరేక పనులు చేశాడని చెప్పారు.

Also Read..Lord Ayyappa : రేంజర్లలో ఉద్రిక్తత.. అంబేద్కర్ సంఘం నేత రాజేశ్‌ను అప్పగించాలని అయ్యప్ప స్వాముల డిమాండ్

”హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామి గురించి భైరి నరేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిన్న కొడంగల్ లో ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేయడం జరిగింది. మత విద్వేశాలను రెచ్చగొట్టారు, ఇతర కులాల గురించి ప్రస్తావించారు.

ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 24 గంటల్లోనే ఈ రోజు ఉదయం భైరి నరేశ్ ను వరంగల్ జిల్లా కమలాపూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాం. నరేశ్ తో పాటు ఆ ప్రోగ్రామ్ ను ఆర్గనైజ్ చేసిన డోలు హనుమంతును కూడా అదుపులోకి తీసుకున్నాం.

Also Read..Bairi Naresh On Ayyappa : అగ్గి రాజేసిన బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తుల డిమాండ్

తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్న అయ్యప్ప స్వాములు కూడా సంయమనం పాటించాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో పోలీసులు మరింత యాక్టివ్ గా పని చేస్తారు. నేరస్తులకు కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తాం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గతంలో కూడా భైరి నరేశ్ పలు సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా, అక్కడ కేసులు నమోదైనట్లుగా మా నోటీసులో ఉంది. ఈ డేటా అంతా కలెక్ట్ చేసి కోర్టులో సమర్పించి భైరి నరేశ్ కు శిక్ష పడే విధంగా చూస్తాం. పీడీ యాక్ట్ నమోదుకు కూడా ప్రతిపాదనలు పంపించి సీరియస్ గా యాక్షన్ తీసుకునే విధంగా చూస్తాం” అని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.

కొడంగల్ లో నిర్వహించిన అంబేద్కర్ సభలో ఓయూ విద్యార్థి, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేశ్.. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. కారుకూతలు కూశాడు. అతడి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. ఏపీ, తెలంగాణలోని అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్ పై మండిపడ్డారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్‌ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేశ్. అయ్యప్ప స్వామి జననాన్ని, పురాణాన్ని కించపరుస్తూ కారుకూతలు కూశాడు.

ఎంతోమంది నమ్మకంగా కొలిచే అయ్యప్పస్వామిని కించపరుస్తూ నరేశ్ మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగారు. భైరి నరేశ్ ను వెంటనే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవుళ్లను తిట్టడం ప్రతోడికి ఫ్యాషన్ గా మారిందని, హిందువుల దేవుళ్లను దూషిస్తే బాగా పబ్లిసిటీ వస్తుందని కొందరు ఇలా దిగజారిపోతున్నారని అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలన్నారు. దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.