Riya Kumari: హైవేపై ఝార్ఖండ్ నటి కాల్చివేత.. సినీ నిర్మాత అరెస్ట్

బుధవారం రియా, ఆమె భర్త ప్రకాష్ కలిసి కారులో కోల్‌కతాకు సమీపంలోని బగ్నాన్ హైవైపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఒక చోట విశ్రాంతి కోసం కారు ఆపారు. అప్పుడే ముగ్గురు దోపిడీ దొంగలు అక్కడికి వచ్చి, వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు, డబ్బు వంటివి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.

Riya Kumari: హైవేపై ఝార్ఖండ్ నటి కాల్చివేత.. సినీ నిర్మాత అరెస్ట్

Riya Kumari: ఝార్ఖండ్‌కు చెందిన నటి, యూట్యూబర్ రియా కుమారి (32) బుధవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని, ఒక హైవేపై దోపిడీ దొంగలు రియాను కాల్చి చంపినట్లు ఆమె భర్త పోలీసులకు వెల్లడించాడు. ఈ కేసులో ఆమె భర్త, నిర్మాత అయిన ప్రకాష్ కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

ఘటన గురించి భర్త చెప్పిన వివరాల ప్రకారం.. బుధవారం రియా, ఆమె భర్త ప్రకాష్ కలిసి కారులో కోల్‌కతాకు సమీపంలోని బగ్నాన్ హైవైపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఒక చోట విశ్రాంతి కోసం కారు ఆపారు. అప్పుడే ముగ్గురు దోపిడీ దొంగలు అక్కడికి వచ్చి, వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు, డబ్బు వంటివి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన రియా కుమారిని కాల్చి చంపారు. వెంటనే భయపడ్డ ప్రకాష్ వేగంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక అక్కడ కనిపించిన వారికి విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. అందరూ కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ రియా కుమారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Akhilesh Yadav: బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్

పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. రియా మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే, రియా హత్య గురించి ఆమె భర్త చెప్పిన విషయం పోలీసులకు అనుమానాస్పదంగా అనిపించింది. ఇదే సమయంలో రియా కుటుంబ సభ్యులు కూడా ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో రియాను భర్త ప్రకాష్ వేధింపులకు గురి చేశాడని, ఆమె సంపాదనను వాడుకునే వాడని, అంతే కాకుండా.. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించే వాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో రియా భర్తను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. ఝార్ఖండ్‌లో నటిగా, యూట్యూబర్‌గా పేరు తెచ్చుకుంది రియా కుమారి.