Akhilesh Yadav: బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి దశ ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ యాత్ర జనవరి 3 నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా అఖిలేష్ యాదవ్‌తోపాటు, మాయావతి తదితరులను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది.

Akhilesh Yadav: బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: రాజకీయాల పరంగా బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఆ రెండు పార్టీలకు సమదూరం పాటిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి దశ ముగిసిన సంగతి తెలిసిందే.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

రెండో దశ యాత్ర జనవరి 3 నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా యూపీ ప్రతిపక్ష నేతలైన అఖిలేష్ యాదవ్‌తోపాటు, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ యాత్రలో పాల్గొనేందుకు అఖిలేష్, మాయావతి నిరాకరించారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై గురువారం అఖిలేష్‌ను మీడియా ప్రశ్నించింది. ‘మీకు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో పాల్గొనే అవకాశం వస్తే వెళ్తారా’ అని మీడియా ప్రశ్నించింది. దీనికి అఖిలేష్ సమాధానమిస్తూ.. ‘‘బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. మా పార్టీ సిద్ధాంతం రెండింటికీ భిన్నమైంది.

Anant Ambani: ముకేష్ అంబానీ తనయుడి నిశ్చితార్థం… రాధికా మర్చంట్‌ను వివాహమాడనున్న అనంత్ అంబానీ

యాత్రలో పాల్గొనాలని నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ ఆహ్వానం వచ్చినట్లుగా మీ ఫోన్లలో ఏదైనా ఉంటే చూపించండి’’ అని బదులిచ్చాడు. దీన్ని బట్టి, ఆయనకు కాంగ్రెస్ నుంచి యాత్రలో పాల్గొనాలని ఆహ్వానం రాలేదని, అలాగే యాత్రకు ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోంది. మాయావతి కూడా కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే, అది ప్రత్యర్థి ఓట్లలో చీలిక తెచ్చి, బీజేపీకి కలిసొచ్చేలా చేస్తుందని మాయావతి వ్యాఖ్యానించింది.