State Bank Of India : ఎస్‌బీ‌ఐలో నగదు అవకతవకలు- రూ.5 కోట్లు కాజేసిన క్యాషియర్ ?

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల ఎస్‌బీఐలో భారీగా నగదు అవకతవకలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

State Bank Of India : ఎస్‌బీ‌ఐలో నగదు అవకతవకలు- రూ.5 కోట్లు కాజేసిన క్యాషియర్ ?

State Bank Of India

State Bank Of India :  మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల ఎస్‌బీఐలో భారీగా నగదు అవకతవకలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందులో పనిచేసే ఉద్యోగి డబ్బులను సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది. వాడుకున్న డబ్బు సుమారుగా 5 కోట్ల 20 లక్షల రూపాయలు ఉంటుందని నర్సాపూర్ బ్యాంకు అధికారులు తెలిపారు.

ఈ విషయంపై స్ధానిక బ్యాంకు అధికారులు హైదరాబాదులోని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. గత వారం రోజుల నుండి బ్యాంకులో లావాదేవీలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. నిజ నిర్ధారణ అయిన తరువాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు.

ఈ విషయమై బ్యాంక్ మేనేజర్‌ను వివరణ కోరగా… సమాచారం అంతా ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, విచారణ జరుగుతోందన్నారు. ఈ భారీ కుంభకోణంలో బ్యాంకులో పనిచేసే క్యాషియర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆరోజు నుండి ఆఉద్యోగి పరారీలో   ఉన్నాడు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిని విధులను తప్పించినట్లు బ్యాంక్ మేనేజర్ నరసయ్య తెలిపారు.

Also Read : Haridwar : తమను వదిలేసి బారాత్ కు వెళ్లాడని..వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేసిన స్నేహితులు