Gold Smuggling : దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లైఫ్ జాకెట్ లో రూ. కోటి విలువైన బంగారం

గోల్డ్ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఎయిర్ పోర్ట్స్ లలో కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు సినీ ఫక్కీలో రోజుకో కొత్త దారిలో

Gold Smuggling : దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లైఫ్ జాకెట్ లో రూ. కోటి విలువైన బంగారం

Delhi

Gold Smuggling గోల్డ్ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఎయిర్ పోర్ట్స్ లలో కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు సినీ ఫక్కీలో రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాశ్రయంలో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది.

భార‌త్‌కు చెందిన వ్యక్తి ఓ కేసులో అరెస్టై దుబాయ్‌ జైలులో మూడేళ్లుగా శిక్ష అనుభవించాడు. తాజాగా జైలు నుంచి విడుద‌లైన అతడు ఇవాళ స్పెస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాడు. అయితే విమానంలో త‌న‌కిచ్చిన లైఫ్ జాకెట్‌ను నిందితుడు ఫ్లైట్ సీటు కింద వదిలేసి కింద‌కు దిగాడు.

అతనిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో లైఫ్ జాకెట్‌ను పరిశీలించగా రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ రూ.కోటి ఉంటుంద‌ని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అయితే బంగారం సీటు కింద ఎందుకు దాచిపెట్టావంటూ అధికారులు నిందితుడిని అధికారులు ప్రశ్నించగా..త‌న‌కు బంగారం ఇచ్చిన వాళ్లే సీటు కింద వ‌దిలేయ‌మ‌ని చెప్పార‌ని సమాధానమిచ్చాడు. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగారం స్మగ్లింగ్‌పై లోతైన ద‌ర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

ALSO READ Uganda: ఉగాండాలో భారీ పేలుడు.. తప్పించుకున్న భారత పారా బ్యాడ్మింటన్ జట్టు