Drug supplier Mohit : పబ్‌లో వెయిటర్ నుంచి .. డ్రగ్ సప్లయిర్‌గా మారిన హీరోయిన్ భర్త మోహిత్

డ్రగ్స్ సప్లయర్ మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. మోహిత్ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ నుంచి 12 ఏళ్ల క్రితం ముంబై వెళ్లిన మోహిత్ ఓ పబ్ లో వెయిటర్ గా పనిచేస్తే డ్రగ్స్ సప్లయిర్ గా మారాడని గుర్తించారు.

Drug supplier Mohit : పబ్‌లో వెయిటర్ నుంచి .. డ్రగ్ సప్లయిర్‌గా మారిన హీరోయిన్ భర్త మోహిత్

Shocking facts are revealed in the investigation of drug supplier Mohit

Drug supplier Mohit : డ్రగ్స్ సప్లయర్ మైరాన్ మోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. నూతన సంవత్సరం వేడుకలకు డ్రగ్స్ సప్లయ్ చేసేందుకు డిసెంబర్ 31కు ముందే మోహిత్ హైదరాబాద్ కు వచ్చారు. కాగా మోహిత్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఓ సాధారణ వెయిటర్ నుంచి డ్రగ్ సప్లయిర్ గా మారిన వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రముఖ హీరోయిన్ నేహాదేశ్ పాండే మోహిత్ భర్త మోహిత్ ను డ్రగ్స్ సప్లై చేస్తుండగా నార్కోటిక్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాద్, గోవా,ముంబైలో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్ కు పరిచయాలున్నాయి.సినీ ప్రముఖులకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు అధికారులు. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన మోహిత్ ఓ పబ్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. ఆ తరువాత పరిచయాలు పెంచుకుని తన డ్రగ్స్ సప్లైర్ గా మారాడు. పెద్ద పెద్దవారితో పరిచయాలు..వారికి డ్రగ్స్ సప్లై చేస్తూ పెరిగాడు. అలా ఓ సాధారణ వెయిటర్ స్థానం నుంచి ఓ హీరోయిన్ కు భర్త అవ్వటమేకాకుండా తన డ్రగ్స్ దందాను పెంచుకున్నాడు. మన్యం కృష్ణ కిషోర్ రెడ్డితోపాటు ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ మేనేజర్ గా కొనసాగుతున్నాడు మోహిత్.

Drug Supplier Mohit Arrest : డ్రగ్స్ సప్లయర్ మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి అరెస్టు

కాగా కృష్ణ కిషోర్ రెడ్డి ఏపీ మాజీ మంత్రికి సమీప బంధువు కూడా.కృష్ణ కిషోర్ రెడ్డి, మోహిత్ ను అరెస్ట్ చేసిన అధికారులు వీరిద్దరి నుంచి పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకన్నారు. కృష్ణ కిషోర్ రెడ్డి బస్సుల్లో హైదరాబాద్‌కు డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. న్యూ ఇయర్‌కు సెలబ్రేషన్స్‌కు ముందే మోహిత్ డ్రగ్స్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. మోహిత్ భార్య నేహా దేశ్ పాండే తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. మోహిత్ కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులకు, బడా బాబుల పిల్లలకు కొకైన్ సరఫరా చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. వీరి విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.