Bihar: హిట్ అండ్ డ్రాగ్.. బిహార్‌లో వృద్ధుడిని ఢీకొని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వృద్ధుడు మృతి

వృద్ధుడిని ఢీకొన్న కారు అతడిని అలాగే ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు కారు కింద పడి మరణించాడు. ఈ ఘటన తూర్పు చంపారన్ జిల్లాలో, 27వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది.

Bihar: హిట్ అండ్ డ్రాగ్.. బిహార్‌లో వృద్ధుడిని ఢీకొని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వృద్ధుడు మృతి

Bihar: హిట్ అండ్ డ్రాగ్ ఘటనలు ఇటీవల అనేకం జరుగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఢిల్లీలో అంజలి అనే యువతిని కారు కింది భాగంలో ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే బెంగళూరులో ఒక వ్యక్తిని మహిళ తన కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లింది. మరో ఘటనలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌ను కూడా కారుతో కొద్ది దూరం ఈడ్చుకెళ్లాడు డ్రైవర్.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

ఈ ఘటనలు మరువక ముందే బిహార్‌లో మరో దారుణ ఘటన జరిగింది. వృద్ధుడిని ఢీకొన్న కారు అతడిని అలాగే ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు కారు కింద పడి మరణించాడు. ఈ ఘటన తూర్పు చంపారన్ జిల్లాలో, 27వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారికి దగ్గర్లోని బంగ్రా గ్రామానికి చెందిన శంకర్ చౌదుర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు హైవే మీద సైకిల్‌పై వెళ్తుండగా, వేగంగా వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో వృద్ధుడు ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అప్పుడు అతడు కారు వైపర్, బానెట్‌ను పట్టుకుని తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. రక్షించమని, సహాయం కోసం గట్టిగా అరిచాడు. కారు ఆపమని ప్రాధేయపడ్డాడు.

Ghaziabad: ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. ప్రియుడిని చంపి ముక్కలుగా నరికిన భర్త

అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపకుండా వేగంగా నడుపుతూనే ఉన్నాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు కారును ఫాలో అయ్యారు. వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ, కారును ఆపాల్సిందిగా డ్రైవర్‌కు సూచించారు. అయినప్పటికీ, కారును ఆపకుండా వేగంగా నడిపిన డ్రైవర్.. తనను ఎక్కువ మంది ఫాలో అవ్వడం గుర్తించి సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వృద్ధుడు ఎగిరి కారు ముందు భాగంలో పడిపోయాడు. కారు అతడిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. కారుతోపాటు డ్రైవర్ పారిపోయాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అన్ని చోట్లా పోలీసుల్ని అలెర్ట్ చేసి విచారణ జరిపారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.