Gang Rape : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం-ఏడుగురు అరెస్ట్

బెంగళూరులోని యలహంకలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరోక   నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Gang Rape : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం-ఏడుగురు అరెస్ట్

Minor Girl Gang Rape

Gang Rape : బెంగళూరులోని యలహంకలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరోక   నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

వివరాలలోకి వెళితే… యలహంకకు  చెందిన 16 ఏళ్ల బాలిక  25ఏళ్ల వ్యక్తితో ప్రేమలో ఉంది. ఒకరోజు బాలికను యలహంక లోని తన ఇంటికి  తీసుకు వెళ్లాడు  ఆమె ప్రియుడు. అక్కడ  ఆమెపై లైంగిక దాడి జరిపాడు. ఈ ఘటన మొత్తాన్ని అతని స్నేహితుడు వీడియో తీశాడు.

నిందితులు ఇద్దరూ ఈ వీడియోను బాలికకు చూపించి మరో సారి లైంగిక దాడి జరిపారు. అంతటితో ఆగక  వీడియోను తమ స్నేహితులకు షేర్ చేశారు. వారు వీడియోను వైరల్ చేస్తామని  బెదిరించి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఘటనతో  బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లితండ్రులకు ఈ విషయం చెప్పింది.

బాలిక తల్లితండ్రులు ఏప్రిల్ 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న యలహంక పోలీసులు ఈ కేసులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Covid-19 compensation: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం..60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు
ఈ కేసులో బాలిక ప్రియుడు ప్రధాన నిందితుడని, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారిని….వీడియోను షేర్ చేసిన మిగిలిన స్నేహితులను అదుపులోకి తీసుకున్నామని మరోక నిందితుడు పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు విచారణ నిమిత్తం అంద చేశారు.