Kerala : ఎస్ఐపై కత్తితో దాడి.. చాకచక్యంగా తప్పించుకుని నిందితుడిని పట్టేశాడు
అన్న దమ్ముల ఆస్తి తగాదాలో ఒక సబ్ ఇనస్పెక్టర్ తనకు అనుకూలంగా వ్యవహరించ లేదనే కోపంతో ఒక వ్యక్తి ఎస్సైను హత్య చేయటానికి ప్రయత్నించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.

Kerala : అన్న దమ్ముల ఆస్తి తగాదాలో ఒక సబ్ ఇనస్పెక్టర్ తనకు అనుకూలంగా వ్యవహరించ లేదనే కోపంతో ఒక వ్యక్తి ఎస్సైను హత్య చేయటానికి ప్రయత్నించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.
అలప్పుజ జిల్లాలోని నూరనాడ్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ వీఆర్ అరుణ్ కుమార్ (37) ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా వస్తే దానిని పోలీసు స్టేషన్ లో అన్నదమ్ముల ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈవిషయం లో తమ్ముడు ఎల్లుం విలాయిల సుగతన్(48) ఎస్సైపై కోపంగా ఉన్నాడు. ఎస్సై తన అన్నకు అనుకూలంగా వ్యవహరించాడని పగ పెంచుకున్నాడు.
దీంతో జూన్ 11 వ తేదీ శనివారం నాడు పెద్ద కత్తి తీసుకుని యాక్టివా బైక్ మీద పోలీసు స్టేషన్ వద్దకు వచ్చాడు. ఎస్సై స్టేషన్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఎదురు చూశాడు. ఎస్సై బయటకు రావటం చూసి యాక్టివాను ముందుకు పోనిచ్చి … రోడ్డు పక్కన నిలబడి జీపులో వెళ్తున్న ఎస్సైని కవ్వించేట్టు చూశాడు. అప్పటికే సుగతన్ ను గుర్తు పట్టిన ఎస్సై జీపు దిగాడు.
వెంటనే సుగతన్ యాక్టివాలో దాచి ఉంచిన పొడవాటి కత్తి తీసుకుని ఎస్సైపై దాడి చేయటానికి ప్రయత్నించాడు. చేయి అడ్డం పెట్టుకుని సుగతన్ దాడి నుంచి తప్పించుకునేందుకు ఎస్సై ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. మొత్తానికి సుగతన్ చేతిలోంచి కత్తిని ఎస్సై స్వాధీనం చేసుకున్నాడు.
సుగతన్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ పెనుగులాటలో ఎస్సై చేతికి గాయం కావటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదంతా అక్కడ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిని కేరళ పోలీసు శాఖ తన ఫేస్ బుక్ పేజీలో ఇటీవల పోస్ట్ చేయటంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : Agnipath Protests : సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నర్సరావుపేట అభ్యర్ధులే ఎక్కువ..?
1Food Poison : పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్ధత
2YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప పర్యటన ఖరారు
3Vishnupriya : అవకాశాల కోసం మరోసారి రెచ్చిపోయిన విష్ణుప్రియ
4Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత గుండెనొప్పులు పెరుగుతున్నాయట
5Srinivasa Mangapuram : హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
6Tapsee : నేను, సమంత కలిసి పనిచేయబోతున్నాం..
7Emirates Airbus : గాల్లో ఉన్న విమానానికి రంధ్రం-14 గంటలు గాల్లోనే ప్రయాణం
8Service charge: హోటల్స్, రెస్టారెంట్లకు షాక్.. సర్వీస్ ఛార్జ్‌లపై నిషేదం
9Upasana : పిల్లలు, ప్రెగ్నెన్సీపై ఉపాసన వ్యాఖ్యలు.. పిల్లలు లేకపోయినా పర్లేదు అన్న సద్గురు..
10Taliban Commander: తాలిబాన్ ఆర్మీ కమాండర్.. భార్యను మిలటరీ హెలికాప్టర్లో ఇంటికి
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!