Agnipath Protests : సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నర్సరావుపేట అభ్యర్ధులే ఎక్కువ..?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు. 

Agnipath Protests : సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నర్సరావుపేట అభ్యర్ధులే ఎక్కువ..?

agnipath protests

Agnipath Protests :  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు.  గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభ్యర్ధులను వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి  నివాసంలో హాజరు పరచనున్నారు.

నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్దులే దాడికి దిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. వారిలో ఎక్కువ మంది సాయి డిఫెన్స్ అకాడమీ లో చదువుకున్నవారే నని తేలింది. నరసరావుపేటతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ విద్యార్ధులు కూడా ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. ఈ అల్లర్లకు కుట్ర చేసింది నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ  డైరెక్టర్  సుబ్బారావేనని తేలటంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఈరోజు సుమారు మరో  100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే   రైల్వే పోలీసుల అదుపులో 22మంది ఉన్నారు.  రైల్వే స్టేషన్ పై  దాడిచేసి విధ్వంసం సృష్టించిన వారిలో సాయి అకాడమి అభ్యర్ధులు…హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో రెండు  రోజల క్రితమే వాట్సప్   గ్రూప్ క్రియేట్ చేసినట్లు  పోలీసులు గుర్తించారు.

మిగిలిన సభ్యులను గుర్తించేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వాట్సప్ గ్రూప్ లో రెచ్చగొట్టిన వారిని గుర్తించిన పోలీసులు ఫోన్ నెంబరు  ఆధారంగా వారిని పట్టుకోటానికి గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారిపై పోలీసులు 14సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.

IPC సెక్షన్ 143, 147, 307, 435, 427, 448, 336, 332, 341, 149,150, 151, 152 IRA, 3PDPPA సెక్షన్ల కింద కేసులు నమోదు నమోదు చేస్తున్నారు. గుంటూరు నుంచి హైద్రాబాద్‌కు వచ్చిన ట్రెయిన్ లో 450 మంది నరసరావుపేట సాయి అకాడమీ కు చెందినవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  హకీంపేట్ ఆర్మీ ర్యాలీకి వచ్చిన వారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు …వాట్సప్ గ్రూప్స్,సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఆందోళనకారులను గుర్తిస్తున్నారు.

Also Read : Secunderabad Violence Loss : సికింద్రాబాద్ విధ్వంసం.. రైల్వేశాఖకు రూ.12కోట్ల ఆస్తి నష్టం