Kerala Shocker: మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కిరోసిన్ పోసి కాల్చిన కొడుకు

మద్యానికి బానిసైన కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. తాగడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఆమెపైనే కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Kerala Shocker: మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కిరోసిన్ పోసి కాల్చిన కొడుకు

Updated On : September 22, 2022 / 1:55 PM IST

Kerala Shocker: మద్యానికి బానిసైన కొడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన గత మంగళవారం కేరళలోని త్రిశూర్ జిల్లా, పున్నయురుకులం సమీపంలో ఉన్న చెమ్మనూర్ అనే గ్రామంలో జరిగింది.

Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ

బాధిత మహిళను 75 ఏళ్ల హలెక్కట్టిల్ వీట్టిల్ శ్రీమతిగా గుర్తించారు. నిందితుడైన ఆమె కొడుకును మనోజ్ (53)గా గుర్తించారు. మద్యానికి బానిసైన మనోజ్ తరచూ, తన తల్లి వీట్టిల్ శ్రీమతిని మద్యం కోసం డబ్బులు ఇవ్వమని వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరికీ నిత్యం గొడవలయ్యేవి. తరచూ మనోజ్, తల్లిపై దాడి చేస్తుండేవాడు. ఈ క్రమంలో గత మంగళవారం మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని తల్లిని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించింది. వెంటనే కోపంతో ఊగిపోయిన మనోజ్ కిరోసిన్ తీసుకొచ్చి, తల్లిపై పోశాడు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది.

Doctor Revives Newborn Baby: ఊపిరి ఊది చిన్నారి ప్రాణం నిలబెట్టిన డాక్టర్.. వీడియో వైరల్

వెంటనే ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పేశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను స్థానిక కున్నాకులం ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడ్నుంచి కోచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీట్టిల్ శ్రీమతి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనకు బాధ్యడైన మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.