కౌశిక్ రెడ్డి మా పై దాడి చేశాడు : జీవితా రాజశేఖర్

  • Edited By: chvmurthy , February 4, 2019 / 03:23 PM IST
కౌశిక్ రెడ్డి మా పై  దాడి చేశాడు : జీవితా రాజశేఖర్

హైదరాబాద్ : సినీహీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు కౌశిక్‌ రెడ్డి దాడిచేశాడని జీవిత రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబరు 45లో సినీ హీరో రాజశేఖర్  సోదరుడు గుణ శేఖర్ కు చెందిన జ్యూయలరీ షాప్ ముందు కౌశిక్ రెడ్డి  కారు పార్క  చేశాడు. షాపు  ముందు నుంచి కారు తీయమని గుణశేఖర్ చెప్పటంతో, ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి గుణశేఖర్ పై వాగ్వివాదానికి  దిగాడు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి గుణశేఖర్ పై దాడి చేశాడు.  ఈ ఘటన శనివారం జరిగింది

షాపు ముందున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలతో   జీవితా రాజశేఖర్ సోమవారం  బంజారా హిల్స్ లోని సీపీ కార్యాలయానికి వెళ్లి  ఫిర్యాదు చేశారు. రాజకీయంగా పలుకుబడి ఉందన్న కారణంగానే కౌశిక్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని,  కౌశిక్ రెడ్డి  వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని జీవిత కోరారు.