West Bengal: డ్రగ్స్ కొనడానికి రూ.10 అడిగిన యువకుడు.. బండరాయితో కొట్టి చంపిన స్నేహితుడు

ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్‭కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూపాయలు అడిగాడు. అంతే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి, డబ్బులు అడిగిన మిత్రుడిని మరొక మిత్రుడు బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

West Bengal: డ్రగ్స్ కొనడానికి రూ.10 అడిగిన యువకుడు.. బండరాయితో కొట్టి చంపిన స్నేహితుడు

Man kills friend over Rs 10 in West Bengal's Siliguri

West Bengal: ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్‭కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూపాయలు అడిగాడు. అంతే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి, డబ్బులు అడిగిన మిత్రుడిని మరొక మిత్రుడు బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

India-China Clash: లోక్‭సభలో వరుసగా మూడో రోజు వాయిదా నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

మరణించిన వ్యక్తి పేరు రాంప్రసాద్ సాహా (20). బైకుంతపూర్ అడవుల్లో అతడి మృతదేశం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహా మాదకద్రవ్య వినియోగానికి వ్యసనపరుడు. ఇందుకోసం క్రమం తప్పకుండా అడవికి వెళ్తుంటాడు. కాగా, తాజాగా తన స్నేహితులు సుబ్రతా దాస్ (22), అజయ్ రాయ్ (24)తో కలిసి సాహా సోమవారం అడవికి వెళ్లాడు. వీరిద్దరు కూడా మాదకద్రవ్యాలకు బానిసలే. ముగ్గురు కలిసి డ్రగ్స్ తీసుకున్నారు.

Raghuram Rajan: వృద్ధి రేటు అంతకు పెరిగితే దేశం అదృష్టం చేసుకున్నట్లేనట.. జీడీపీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

అధిక స్థాయిలో ఉన్న సాహా.. తనకు మరింత డ్రగ్స్ కావాలని, తనకు 10 రూపాయలు ఇవ్వమని సుబ్రతాను అడిగాడు. ఇద్దరి మధ్య వెంటనే గొడవ జరిగి సాహాను సుబ్రత రాయితో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. సిలిగురి మెట్రో పోలీస్‌లోని అషిఘర్ ఔట్‌పోస్ట్ అధికారులు బుధవారం రాత్రి సుబ్రతను, అజయ్‌ను అరెస్టు చేశారు. మొత్తం ఎపిసోడ్‌లో అజయ్ పాత్రను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.