Raghuram Rajan: వృద్ధి రేటు అంతకు పెరిగితే దేశం అదృష్టం చేసుకున్నట్లేనట.. దేశ ఆర్థిక స్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

ఇది చాలా పెద్ద సమస్య. ఉన్నత మధ్యతరగతి వారు మహమ్మారి సమయంలో పని చేయగలిగినందున వారు కొంత లాభపడ్డారు. అయితే నట్టేట మునిగింది పేదలే. పేదలు కర్మాగారాల్లో ఎక్కువగా పని చేస్తారు. రోజూ కూలీలు. కర్మాగారాలు మూసేయడం, పనులు ఆపివేయడం వల్ల వారు ఉపాధి పూర్తిగా కోల్పోయారు. దేశంలో ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతల్ని మహమ్మారి మరింత పెంచింది

Raghuram Rajan: వృద్ధి రేటు అంతకు పెరిగితే దేశం అదృష్టం చేసుకున్నట్లేనట.. దేశ ఆర్థిక స్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

We Will Be Lucky If We Get 5% Growth Next Year says Raghuram Rajan

Raghuram Rajan: వచ్చే ఏడాది ఐదు శాతం వృద్ధి సాధిస్తే దేశం చాలా అదృష్టం చేసుకున్నట్లేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితో పోలిస్తే వచ్చే ఏడాది మరింత కష్టతరంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రపంచంలో వృద్ధి మందగిస్తోందని, ప్రజలు వడ్డీ రేట్లను పెంచడం వల్ల వృద్ధి రేటు తగ్గుతోందని ఆయన అన్నారు. బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ “భారతదేశం కూడా దెబ్బతింటుంది. భారతదేశ వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. అయితే ఇదే సమయంలో భారతీయ ఎగుమతులు కొంచెం మందగించాయి” అని అన్నారు.

Raju Safe: రాజు సేఫ్.. బండరాళ్ల మధ్యనుంచి సురక్షితంగా బయటకు.. ఫలించిన అధికారుల కృషి

“సరుకుల ద్రవ్యోల్బణం, కూరగాయల ద్రవ్యోల్బణం గురించి తెలుసుకుంటే భారతదేశ ద్రవ్యోల్బణం సమస్య ఏంటనేది అర్థమవుతుంది. అది కూడా వృద్ధికి ప్రతికూలంగా ఉంటుంది. వృద్ధి సమస్య ఏంటంటే, మీరు దేన్ని కొలమానంగా తీసుకున్నారో అర్థం చేసుకోవాలి. వచ్చే ఏడాది 5 శాతం వృద్ధి రేటు కనబరిస్తే మనం చాలా అదృష్టవంతులం” అని రాఘురాం రాజన్ అన్నారు. కాగా, దీనికి కారణమేమిటని రాహుల్ గాంధీ అడిగితే “కొవిడ్ మహమ్మారి ప్రభావమే. అయితే దానికి ముందే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. అప్పటికే 9 నుంచి 5కి చేరుకుంది. వృద్ధి రేటు పెంచే చర్యలు తీసుకోవడం కూడా అంత సులభం కాదు” అని రాజన్ సమాధానం చెప్పారు.

Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

ఇక దేశంలోని ఆర్థిక అసమానతల గురించి రాహుల్ ప్రశ్నిస్తూ “దేశంలో ఒక భిన్న పరిస్థితి రాను రాను ఎక్కువవుతోంది. కేవలం 4-5 వ్యక్తులు ధనవంతులు అవుతున్నారు. నానాటికీ వారి ఆస్తులు పెరుగుతున్నాయి. అదే సమయంలో మిగిలిన ప్రజలు వెనుకబడి ఉన్నారు. వారు మరింత వెనకబడుతున్నారు. ఈ 4-5 వ్యక్తుల వాస్తవానికి రైతులు, పేదలు కలలు నెరవేరడమే కాదు ఈ 4- 5 వ్యక్తుల కలలు నెరవేరుతున్నాయి. మిగిలిన వారి కలలు నెరవేరట్లేదు. ఈ అసమానతలను అధిగమించాలంటే మనం ఏమి చేయాలి?’’ అని ప్రశ్నించారు.

Electricity Bill on Paytm : పేటీఎం ద్వారా కరెంట్ బిల్లు కడుతున్నారా? ఇలా చేస్తే.. 100శాతం క్యాష్‌బ్యాక్, మరెన్నో రివార్డులు పొందవచ్చు..!

“ఇది చాలా పెద్ద సమస్య. ఉన్నత మధ్యతరగతి వారు మహమ్మారి సమయంలో పని చేయగలిగినందున వారు కొంత లాభపడ్డారు. అయితే నట్టేట మునిగింది పేదలే. పేదలు కర్మాగారాల్లో ఎక్కువగా పని చేస్తారు. రోజూ కూలీలు. కర్మాగారాలు మూసేయడం, పనులు ఆపివేయడం వల్ల వారు ఉపాధి పూర్తిగా కోల్పోయారు. దేశంలో ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతల్ని మహమ్మారి మరింత పెంచింది. వీరితో పాటు దిగువ మధ్యతరగతి వారు కూడా ఉద్యోగాలు కోల్పోయి చాలా నష్టపోవాల్సి వచ్చింది” అని రఘురాం రాజన్ అన్నారు.

Winter Health Benefits : శీతకాలంలో ఉదయాన్నే వీటిని తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మనం పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ఉండలేము. కానీ కంపెన్సెషన్ కోసం పోరాడాలి. గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. గుత్తాధిపత్యం దేశానికి మంచిది కాదు. సాంకేతిక మద్దతు అవసరం, క్రెడిట్ రుణాలు, పాలసీలు ఖచ్చితంగా ఉండాలి. చిన్న వ్యాపారాలు మంచివి. స్థిరమైన ఆదాయ ప్రవాహం అని భావిస్తే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కానీ అందుకు తగిన సమాచారాన్ని అందుబాటులో ఉండాలి. అది ఇప్పుడు జరుగుతోంది. ఫిన్‌టెక్ విప్లవంలో వీటన్నింటి గురించి ఆలోచించడం ప్రారంభించారు. కానీ భారతదేశంలో ఇప్పుడిది 10 రెట్లు ఎక్కువ కావాలి’’ అని అన్నారు.