Winter Health Benefits : శీతకాలంలో ఉదయాన్నే వీటిని తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!
చలికాలం పాలల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బెల్లంలోని పలు సమ్మేళనాలు కొవ్వులను కరిగించటంలో సహాయపడతాయి.

There are many health benefits if you drink these in the morning in winter!
Winter Health Benefits : చలికాలంలో పాలతోపాటు కాస్త బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలు, బెల్లం రెండింటిని విడి విడిగా తీసుకునే బదులు కలిపి ఒకేసారి తీసుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా బెల్లం కలిపి తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పాలలో అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయ పడతాయి. చలికాలంలో వచ్చే పగుళ్ల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం మృదువుగా ఉంటుంది. పగలకుండా రక్షించుకోవచ్చు. పోషకాల ద్వారా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు అవసరం అయిన ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. కనుక పాలలో బెల్లం కలిపి తాగితే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేయడంలో బెల్లం బాగా ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు వెళ్ళిపోతాయి. పాలు, బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తం శుద్ధి జరుగుతుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రక్తంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుకోవచ్చు. శరీరానికి ఐరన్ లభిస్తుంది. దీంతో శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గర్భిణీలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్గా ఉంటారు. జీవక్రియ మెరుగవుతుంది.
చలికాలం పాలల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బెల్లంలోని పలు సమ్మేళనాలు కొవ్వులను కరిగించటంలో సహాయపడతాయి. నెలసరి సమయంలో వీటిని తీసుకోవటం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతర్గత కండరాల సంకోచం తగ్గుతుంది.