Noida : యువతికి అసభ్యకర వీడియో పంపిన ఎంబీఏ విద్యార్ధి అరెస్ట్

నోయిడాకు చెందిన ఎంబీఏ విద్యార్ధి తనకు పరిచయం ఉన్న యువతికి అసభ్యకర వీడియో పంపటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

Noida : యువతికి అసభ్యకర వీడియో పంపిన ఎంబీఏ విద్యార్ధి అరెస్ట్

Noida Mba Student Arrested

Noida :  నోయిడాకు చెందిన ఎంబీఏ విద్యార్ధి తనకు పరిచయం ఉన్న యువతికి అసభ్యకర వీడియో పంపటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడాలోని ఒక యూనివర్సిటీలో ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 26 ఏళ్ల విద్యార్ధికి రెండేళ్లుగా ఒకయువతి(20)తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అతని ప్రవర్తన నచ్చకపోవటంతో ఆ యువతి, యువకుడిని దూరం పెట్టింది.

మార్చి 19న తనతో జిమ్ కు   రావాలని అతను మళ్లీ ఆ యువతిని కోరాడు. అతనికి మరోక అవకాశం ఇవ్వాలని భావించిన యువతి అతనికి తన వాట్సప్ నెంబర్ ఇచ్చింది. అప్పటి నుంచి  తనను శారీరకంగా కలవాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆమె నిరాకరించింది.

మార్చి 21న వాట్సప్‌లో నిందితుడు  అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఒక వీడియో తీసి ఆమెకు పంపించాడు. ఈ వీడియోను చూసిన యువతి షాక్ కు గురైంది.  నిందితుడు పంపిన అసభ్యకరమైన వీడియోతో చిర్రెత్తుకొచ్చిన యువతి మార్చి 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Visakha SP Vs MP: విశాఖలో ఎస్పీ వర్సెస్ ఎంపీ: భూకబ్జా వ్యవహారంపై వివరణ ఇచ్చిన ఇరువురు
నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, 509ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు సోమ‌వారం ఉద‌యం నోయిడా సెక్టార్ 61లో అత‌డిని అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట నిందితుడిని హాజ‌రు ప‌ర‌చ‌గా అతడిని  జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించారు.