Murder : దారుణం-ముక్కలు ముక్కలుగా నరికి హత్య

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మీ సేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్‌ (35)ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. 

Murder : దారుణం-ముక్కలు ముక్కలుగా నరికి హత్య

Peddapalli Murder

Murder :  పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మీ సేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్‌ (35)ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.  హత్యకు గల కారణాలు తెలియరాలేదు. శంకర్ ను హత్యచేసి శరీర భాగాలు ఒక్కో చోట పడేశారు. ఇరవై ఏళ్ల క్రితం గోదావరిఖని‌లో ఇదే తరహా‌లో జరిగిన డిల్లీ హరికృష్ణ హత్యోదంతాన్ని స్ధానికులు గుర్తు చేసుకుంటున్నారు.

ఎన్టీపీసీ ఆస్పత్రిలో పని చేస్తున్న భార్య హేమలతను ఆస్పత్రిలో దింపటానికి ఈ నెల 25 వతేదీ రాత్రి గం.9:30ల సమయంలో ఖాజిపల్లి నుంచి శంకర్ తన భార్యతో బయలు దేరి…. ఆమెను ఆస్పత్రి వద్ద దింపాడు. అనంతరం ఇంటికి వెళ్లాల్సిన శంకర్ ఇంటికి చేరలేదు.

ఆ తర్వాత నుంచి శంకర్ ఆచూకీ లభించలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. రాత్రి ఇంటికి రాకపోవటంతో మర్నాడు 26వ తేదీ కుటుంబ సభ్యులు శంకర్ సె‌ల్‌కు‌ కాల్ చేసారు. కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆరోజంతా కుటుంబ సభ్యులు శంకర్ కోసం ఎదురు చూశారు. అతను ఇంటికి రాలేదు. శంకర్ ఆచూకి దొరక్క పోవటంతో తల్లి పోచమ్మ 26 వ తేదీ సాయంత్రం ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. తన కొడుకు కోడలు మధ్య గత ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయని పోచమ్మ ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది.

27వ తేదీ తెల్లవారుజామున రామగుండం నుంచి మల్యాలపల్లికి  వెళ్లే రాజీవ్ రహదారి పక్కన రెండు చేతులు, తల లభ్యం అయ్యాయి.  వాటిని తీసుకు వచ్చి  పోచమ్మకు చూపించగా అవి తన కుమారుడివే నని ఆమె చెప్పింది. శంకర్ హత్యకు గురయ్యాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు….. ఆ తల, చేతులను గోదావరిఖని ప్రభుత్వం ఆస్పత్రిలో భద్రపరిచారు.
Also Read : Girl Raped In School Toilet : స్కూల్‌లో దారుణం.. టాయిలెట్‌కి వచ్చిన బాలికపై స్వీపర్ అత్యాచారం
డాగ్ స్క్వాడ్ ద్వారా మాల్యాలపల్లి ప్రాంతంలో గాలింపు చేపట్టారు. హత్యలో అనుమానితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.  పోలీసుల గాలింపులో రాత్రి గం.8-30 సమయంలో బసంత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద శంకర్ మొండాన్ని పోలీసులు గుర్తించారు. శంకర్ కు సంబంధించిన రెండు మొకాళ్లను గోదావరిఖని సప్తగిరి కాలనీ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.