Girl Raped In School Toilet : స్కూల్‌లో దారుణం.. టాయిలెట్‌కి వచ్చిన బాలికపై స్వీపర్ అత్యాచారం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా, రేప్ కేసుల్లో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మహిళకు రక్షణ లభించడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు.

Girl Raped In School Toilet : స్కూల్‌లో దారుణం.. టాయిలెట్‌కి వచ్చిన బాలికపై స్వీపర్ అత్యాచారం

Girl Rape

Girl Raped In School Toilet : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా, రేప్ కేసుల్లో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మహిళకు రక్షణ లభించడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశంలో రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు.. కామాంధులు కామంతో రగిలిపోతూ కాటేస్తున్నారు. చిన్నారులను కూడా చిదిమేస్తున్నారు. వీధుల్లోనే కాదు స్కూల్ లోనూ రక్షణ కరువైంది. తాజాగా ఒక స్వీపర్.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.

Akhanda: జగన్, కేసీఆర్‌కు.. బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

వారణాసిలోని లహర్తరా లొకాలిటీ సిగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో సింకు(23) అనే వ్యక్తి స్వీపర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఒక బాలిక టాయిలెట్ కని లోపలికి వెళ్లింది. అక్కడ టాయిలెట్ క్లీన్ చేస్తున్న సింకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అమ్మాయి ముందు జిప్ తీసి అసభ్యంగా మాట్లాడుతూ బలవంతం చేశాడు. స్వీపర్ ప్రవర్తన చూసి భయంతో వణికిపోయిన బాలిక నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని సింకును అరెస్ట్ చేశారు.

UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

స్కూల్ లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని పోలీసులు తెలిపారు. ఆ ఫుటేజీ ఆధారంగానే సింకుని అరెస్ట్ చేశామని సిగ్రా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ బజినాత్ సింగ్ చెప్పారు. బాలిక టాయిలెట్ కి వెళ్లిన సమయంలో సింకు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనతో స్కూల్ లో భయాందోళనలు నెలకొన్నాయి. తోటి విద్యార్థులు, ఆడపిల్లల తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చే వరకు తల్లిదండ్రులు కంగారు పడే పరిస్థితి నెలకొంది.