Mother killed son : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును చంపిన తల్లి-17 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన కోర్టు

తాళి కట్టిన భర్త విధి నిర్వహణలో భాగంగా దేశ సరిహద్దుల్లో జవానుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న భార్య కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నాలుగేళ్ల కొడుకును దారుణంగా చంపింది. ఈ కేసులో నేరం రుజువు కావటంతో న్యాయస్ధానం ఆమెకు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Mother killed son : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును చంపిన తల్లి-17 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన కోర్టు

Mother Killed Son Due To Extra Marital Affair

Mother killed son, due to extra marital affair :తాళి కట్టిన భర్త విధి నిర్వహణలో భాగంగా దేశ సరిహద్దుల్లో జవానుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న భార్య కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నాలుగేళ్ల కొడుకును దారుణంగా చంపింది. ఈ కేసులో నేరం రుజువు కావటంతో న్యాయస్ధానం ఆమెకు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని ఇలయంకుడికి చెందిన శివానందం సైన్యంలో పనిచేస్తుంటాడు. అతనికి భార్య వనిత(29) నాలుగేళ్ల కుమారుడు స్వగ్రామంలోనే నివసిస్తున్నారు. ఈక్రమంలో వనితకు గ్రామంలోని కారు డ్రైవర్ కార్తీక్ రాజాతో పరిచయం అయ్యింది. క్రమేపి వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలయం కుడిలో ఉంటే ఇబ్బంది ఉంటుందని వనిత, కార్తీకరాజా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి వచ్చి కాపురం పెట్టారు.

వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్న సమయంలో కొడుకు వారిద్దరికీ అడ్డంగా మారాడు. దీంతో తమ బంధానికి కొడుకు అడ్డుగా భావించారు.ఈ కారణంతో ఇద్దరూ తరచూ పిల్లవాడ్ని కొట్టసాగారు.ఈ క్రమంలో ఇటీవల అలా కొట్టినప్పుడు పిల్లవాడు స్పృహతప్పిపోయాడు. షాక్ కు గురైన వారిద్దరూ పిల్లవాడ్ని తీసుకుని శివగంగై కి వెళుతున్నట్లు ఇంటియజమానికి చెప్పి బయలు దేరారు. మార్గం మధ్యలో ఉండగా కృష్ణగిరి బస్టాండ్ వద్దకు వచ్చేసరికి పిల్లవాడు ఊపిరాడక చనిపోయాడు.

అక్కడినుంచి బాలుడి మృతదేహాన్ని సమీపంలోని కొండలపై పూడ్చిపెట్టి ఇద్దరూ తిరిగి తిరుపతి వచ్చేశారు. ఇంటికి వచ్చిన వారిని ఇంటి యజమాని పిల్లావాడికి ఎలా ఉందని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఏమి చెప్పాలో అర్ధంకాని వనిత, కార్తీక్ రాజలు ఇద్దరూ .. పిల్లవాడ్ని బంధువుల ఇంటి వద్ద దింపి వచ్చినట్లు చెప్పారు. వనిత మాటలపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనిత, కార్తీక్ రాజాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులకు ఇద్దరూ నిజం చెప్పేసారు. సీన్ రీకనస్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు వారిని కృష్ణగిరి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు.వారు చెప్పిన ఆధారాలతో బాలుడ మృతదేహాన్ని వెలికి తీశారు. కేసును స్ధానిక కృష్ణగిరి పోలీసుకు బదిలీ చేశారు.

నేరం ఒప్పుకున్న నిందితులిద్దరినీ కృష్ణగిరి న్యాయస్ధానంలో హజరు పరచగా న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. బయటకు వచ్చిన కార్తీక్ రాజా అజ్ఞాతంలోకి వెళ్లాడు. కాగా కేసును విచారించిన ట్రయల్ కోర్టు నేరం అంగీకరించిన వనితకు 10వేల రూపాయల జరిమానాతో పాటు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.పరారీలో ఉన్న కార్తీక్ రాజా కోసంపోలీసులు గాలిస్తున్నారు.