ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్

మహారాష్ట్రలోని పర్భానీలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను మహారాష్ట్ర ఏటిఎస్ అధికారులు అరెస్ట్ చేసిన ఘటనలో ఉగ్రవాది మహమ్మద్‌ షాహెద్‌ ఖాన్‌ అలియాస్‌ లాలాకు ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్

Nia

ISIS Terrorist: దేశంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ మూలాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాలు..భారత్ లో విధ్వంసాలకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతుండగా..మరో ఉగ్రవాద సంస్థ ఐసిస్ నుంచి దేశ భద్రతకు తీవ్ర ప్రమాదం పొంచి ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కాగా 2016లో మహారాష్ట్రలోని పర్భానీలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను మహారాష్ట్ర ఏటిఎస్ అధికారులు అరెస్ట్ చేసిన ఘటనలో ఉగ్రవాది మహమ్మద్‌ షాహెద్‌ ఖాన్‌ అలియాస్‌ లాలాకు ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శుక్రవారం కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం..ఉగ్రవాది మహమ్మద్‌ షాహెద్‌ ఖాన్‌ కు శిక్షను ఖరారు చేస్తూనే నిందితుడికి రూ.45,000 జరిమానా కూడా విధించింది. ఉగ్రవాది ఖాన్‌పై ప్రాసిక్యూషన్ వేసిన కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్లు 13, 16, 18, 20, 38, 39, ఐపిసిలోని సెక్షన్ 120-బి మరియు సెక్షన్లు 4, పేలుడు పదార్థాల చట్టంలోని 5, 6 సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరాలకు అతన్ని దోషిగా నిర్ధారించింనట్లు కోర్టు తెలిపింది.

Other Stories: Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద ముఠా నాయకులూ ఇంటర్నెట్ ద్వారా భారత్ లోని కొందరు సానుభూతి పరులను ప్రేరేపించి ఇక్కడి యువకులను ఉగ్రవాదులుగా మార్చడానికి కుట్రలు పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. సిరియా ముఠా నాయకుల ఆదేశాలతోనే 2016లో పర్భానీలో మహ్మద్ రైసుద్దీన్ మహ్మద్ సిద్ధిక్, ఇక్బాల్ అహ్మద్ కబీర్ అహ్మద్, నాసిర్ చౌస్ మరియు షాహీద్ ఖాన్ లు IED బాంబు సమకూర్చుకుని ఔరంగాబాద్ ఏటీఎస్(యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) భవనంపై దాడికి కుట్ర పన్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు ఈ నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ కేసును తొలుత 2016లో ముంబైలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయగా, ఆ తర్వాత ఎన్ఐఏకు అప్పగించింది. విచారణ అనంతరం 2016 అక్టోబర్‌లో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు నాజర్ బిన్ యాఫై (చౌస్)కి మార్చి 2022లో కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.