Online Cheating : ఫోన్ లాక్ చేశారు..మేసేజ్‌లు రాలేదు..రూ. 24 లక్షలు స్వాహా

ఓ మహిళా వ్యాపారి ఖాతా నుంచి రూ. 24 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ వ్యాపారి ఫోన్ కు మెసేజ్ లు రాకుండా చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులను కాజేశారు.

Online Cheating : ఫోన్ లాక్ చేశారు..మేసేజ్‌లు రాలేదు..రూ. 24 లక్షలు స్వాహా

Online Cheat

Online Cheating In Hyderabad : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను స్వాహా చేస్తున్నారు. వారి మొబైల్ లకు కనీసం మెసేజ్ రాకుండానే…డబ్బులు మాయం అవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా..హైదరాబాద్ మహానగరంలో…ఓ మహిళా వ్యాపారి ఖాతా నుంచి రూ. 24 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ వ్యాపారి ఫోన్ కు మెసేజ్ లు రాకుండా చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులను కాజేశారు.

Read More : KCR Speech High Lights : ఇక ధర్నాలు చేస్తాం.. అగ్గి పుట్టిస్తాం…! కేసీఆర్ ఫుల్ స్పీచ్ హైలైట్స్ ఇవే

సైబరాబాద్ క్రైం పోలీసుల వివరాల ప్రకారం…చందానగర్ లో ఓ మహిళ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఆఫ్ బరోడాలో కరెంటు ఖాతాను నిర్వహిస్తున్నారు. ఈ నెల 02వ తేదీన ఆమె ఫోన్ కు కొన్ని గంటల పాటు ఎలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్ లు రాలేదు. దీంతో ఆమె ఏమైందోనని కంగారు పడ్డారు. వెంటనే సంబంధిత సెల్ కంపెనీకి వెళ్లి…అసలు విషయం చెప్పారు. దీంతో ఉద్యోగులు ఆమె ఫోన్ ను పరిశీలించారు. ఫోన్ లాక్ అయినట్లు గుర్తించారు. సిమ్ కార్డు సేవలను పునరుద్ధించగానే…దాదాపు 150 మెసేజ్ లు వెంట వెంటనే వచ్చాయి. అందులో ఓ మెసేజ్ లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి దాదాపు రూ. 24 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు.

Read More : బండి సంజయ్.. బీ కేర్‌ఫుల్.. సీఎం కేసీఆర్ వార్నింగ్

తాను ఎవరికీ డబ్బులు పంపకుండానే..ఎలా బదిలీ అయ్యాయో అర్థం కాలేదు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా వ్యాపారి..ఫోన్ ను బ్లాక్ చేసి ఆమె ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ మెయిల్ లో ఓటీపీలతో నగదు..ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసంలో సిమ్ కార్డు ప్రొవైడర్ హస్తం ఉందని గుర్తించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు..సైబర్ నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు.