Pakistan Drones: చైనా నుంచి మరిన్ని డ్రోన్లు కొనుగోలు చేసిన పాకిస్తాన్

భారత్ లోకి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తరలించేందుకు పాకిస్తాన్ భారీ డ్రోన్లను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.

Pakistan Drones: చైనా నుంచి మరిన్ని డ్రోన్లు కొనుగోలు చేసిన పాకిస్తాన్

Paki

Pakistan Drones:భారత్ లో విధ్వంసానికి పాల్పడేలా పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలు మరిన్ని కుట్రలు పన్నుతున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలే లక్ష్యంగా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ కుట్రపన్నినట్లు భారత నిఘావర్గాలు గుర్తించాయి. ఇప్పటికే ఐఎస్ఐ సహకారంతో పలు సిక్కు ఉగ్రవాద సంస్థలు పంజాబ్ లో తిష్ట వేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఈక్రమంలో భారత్ లో ఉగ్రదాడులకు ఊతమిచ్చేలా పాకిస్తాన్ చర్యలు బట్టబయలు అయ్యాయి. భారత సరిహద్దు వెంబడి పంజాబ్ రాష్ట్రంలో.. పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపుతున్నాయి.

Also read: R Narayanamurthy : జగన్మోహన్ రెడ్డి వల్లే ‘బంగార్రాజు’ సక్సెస్ అయింది

భారత్ లో తిష్టవేసిన పాక్ ఉగ్రవాదులకు.. ఆయుధాలు, మందుగుండ్లు సమకూర్చేందుకు పాకిస్తాన్ భారీ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు భారత BSF అధికారులు గుర్తించారు. భారత్ లోకి ప్రవేశించిన అటువంటి 60కి పైగా(ఇప్పటివరకు) డ్రోన్లను BSF సిబ్బంది కూల్చివేశారు. కాగా, నిఘావర్గాల కళ్లుగప్పి భారత్ లోకి ఆయుధాలు చేరవేసేలా పాకిస్తాన్ మరో కొత్త ఎత్తువేసింది. భారత సెక్యూరిటీ రాడార్ కు అందకుండా ఉండేందుకు గాల్లో ఎత్తున ఎగిరే భారీ డ్రోన్లను పాకిస్తాన్ చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల అబుదాబీ ఎయిర్ పోర్ట్ పై హౌతీ ఉగ్రవాది దాడుల అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో భారత నిఘావర్గాలు, సరిహద్దు భద్రత బలగాలు అప్రమత్తం అయ్యాయి.

Also read: CM Jagan : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు.. కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతి

భారత్ లోకి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తరలించేందుకు పాకిస్తాన్ భారీ డ్రోన్లను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పాక్ ఉగ్రవాదులు వినియోగిస్తున్న డ్రోన్లు, తక్కువ ఎత్తులో ఎగురుతూ, రాడార్ కు చిక్కుతున్నాయి. రాడార్ గుర్తించకుండా ఎక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లనూ పాక్ కొనుగోలు చేసింది. 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ డ్రోన్లు భారీ వర్షంలోనూ ఎగరగలవని సమాచారం. భారత్ లో దాడులే లక్ష్యంగా పాకిస్తాన్ చైనా నుంచి ఈ డ్రోన్లు కొనుగోలు చేసినట్లు భద్రత సంస్థలు పేర్కొన్నాయి.

Also read: AP Night Curfew : నైట్ కర్ఫ్యూ షురూ.. బయటకు వెళ్తే చర్యలు