AP Night Curfew : నైట్ కర్ఫ్యూ షురూ.. బయటకు వెళ్తే చర్యలు

రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు.

AP Night Curfew : నైట్ కర్ఫ్యూ షురూ.. బయటకు వెళ్తే చర్యలు

Ap Night Curfew

AP Night Curfes : ఏపీలో నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కాగా, రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు. పోలీసులు చర్యలు తీసుకుంటారు. అందుకే రాత్రి 11 గంటల లోపే పనులన్నీ ముగించుకుని ఇంటికి చేరుకుంటే బెటర్.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. నిత్యం 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 18 శాతానికిపైగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే రోజువారి నమోదయ్యే కేసుల సంఖ్య పదివేల మార్కుకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. నేటి (జనవరి 18) నుంచి జనవరి 31 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

* బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి
* మాస్కు లేదంటే రూ.100 జరిమానా
* షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా.
* నైట్ కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి అనుమతి
* ఇండోర్ ప్రదేశాల్లో 100 మందికి మాత్రమే అనుమతి

* సినిమా హాళ్లలో 50శాతం సీటింగ్
* సినిమా హాల్స్ లో సీటు వదిలి సీటు విధానాన్ని పాటించాలి, ప్రేక్షకులు మాస్కు ధరించాలి
* ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు ప్రయాణికులూ మాస్కులు ధరించాలి

* అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
* వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్), టెలికాం సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది, పెట్రోల్ బంకులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.
* చికిత్స పొందుతున్న రోగులు, గర్భవతులకు మినహాయింపు.
* విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వారికి మినహాయింపు
* సరకు రవాణా వాహనాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.

Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న డేంజరస్ ‘గ్రహశకలం’

రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారమే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కర్ఫ్యూ అమలు తేదీని వాయిదా వేసింది ప్రభుత్వం. పండుగ ముగియడంతో నేటి(జనవరి 18) నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ప్రజలందరూ మాస్క్ ధరించాల్సిందే.. గడప దాటి బయటకు వస్తే మాస్క్ ధరించాల్సిందే. మాస్క్ లేకుండా ఎవరైనా రోడ్డుపై కనిపిస్తే మొదటి సారి 100 రూపాయల జరిమానా విధిస్తారు. రెండు మూడు సార్లు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచనలు జారీ చేశారు.

ఇక వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. నేటి నుంచి ఎలాంటి కార్యక్రమం అయినా బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇండోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలి.

నేటి నుంచి ప్రతి సినిమా హాలు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపాలి. అలాగే ప్రతి సినిమా హాల్లో సీటు వదిలి సీటు విధానాన్ని పాటించాలి. ప్రేక్షకులందరూ మాస్క్‌ ధరించాలే చేయాలి. నిత్యం సినిమా హాలును శానిటైజ్ చేస్తూ ఉండాలి. టికెట్ కౌంటర్ దగ్గర సైతం భౌతిక దూరం పాటించేలా చేయాలి.

ఇక ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్‌లు తప్పక ధరించాలి. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు.