Ys Jagan: దాని తర్వాతే.. జిల్లాల టూర్ అంటున్న జగన్..! అసలు వైసీపీ చీఫ్ ప్లాన్ ఏంటి?
వైసీపీలో ఉన్న ప్రతీ సభ్యుడికీ గుర్తింపు కార్డుని ఇవ్వాలనేది జగన్ నిర్ణయమంటున్నారు. దాంతో క్యాడర్, లీడర్ల పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేసుకుని..భవిష్యత్ అధికారంలోకి వస్తే అన్ని స్థాయిల్లో నేతలకు అవకాశాలు ఇవ్వాలనేది జగన్ ప్లాన్ అంటున్నారు.
Ys Jagan Mohan Reddy Representative Image (Image Credit To Original Source)
- ఇక దూకుడే..పార్టీ స్ట్రక్చర్‌పై వైసీపీ ఫుల్ ఫోకస్.!
- బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయాలన్న హైకమాండ్
- కమిటీల నియామకం, సభ్యత్వ నమోదుపై రివ్యూలు
- రాయలసీమ టు గోదావరి జిల్లాల వరకు స్పెషల్ డ్రైవ్
Ys Jagan: పవర్ పోయి 18 నెలలు అయిపోతుంది. చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు యాక్టీవ్‌గా లేరు. సభ్యత్వ నమోదు ఊసే లేదు. అధిష్టానం ఒకటి తలస్తే..లీడర్లు మరొక రూట్‌లో వెళ్తున్నారట. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు లేవట. దీంతో సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేసిందట. త్వరగా కమిటీల ప్రక్రియ పూర్తి చేసి..సభ్యత్వ నమోదును స్పీడప్ చేయాలని డైరెక్షన్స్ ఇచ్చారట. ఫ్యాన్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా? జగన్ జిల్లాల పర్యటన అడ్డంకులు ఏంటి?
అధికారం కోల్పోయి..ఏడాదిన్నర కావొస్తోంది. ఇక కొత్త ఏడాది రానే వచ్చింది. సంక్రాంతి దాటాక సమరం స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యిందట వైసీపీ. ఇందులో భాగంగా బూత్ లెవల్ వరకు పార్టీ కమిటీలు ఏర్పాటుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిందట. గతంలో నియోజకవర్గ ఇంచార్జ్‌లు, రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ బూత్ కమిటీల ఏర్పాటుపై డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్. అయితే ఆ దిశగా లీడర్లు యాక్టివ్‌గా పనిచేయడం లేదట.
ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అనుబంధ సంఘాల నియామకం వంటి చర్యలు ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటున్నారు. ఒక నర్సీపట్నం నియోజకవర్గం మాత్రం బూత్ లెవెల్ దాకా కమిటీలు వేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిందట. అందరూ ఇలాగే పనిచేసి పార్టీ యాక్టివిటీని స్పీడ్ చేయాలని సూచిస్తున్నారట వైసీపీ అధినేత. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉంటేనే రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని దిశానిర్దేశం చేస్తున్నారట.
అనుకున్నంత వేగంగా దూకుడు పెంచని లీడర్లు..
కమిటీల ప్రక్రియ ఒకసారి పూర్తైతే సభ్యత్వ నమోదును స్పీడప్ చేసి ఆ తర్వాత బూత్ లెవెల్ నుంచి పార్టీని కదం తొక్కించాలన్నది వైసీపీ పెద్దల ఆలోచన. అయితే కమిటీల ఏర్పాటుపై మాత్రం నేతలు నెలలకు నెలలు గడిపేస్తున్నారట. నియోజకవర్గం, మండలాలు, గ్రామాలు వార్డులు బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయాలని పదే పదే చెప్తున్నా..అనుకున్నంత వేగంగా లీడర్లు దూకుడు పెంచడం లేదట. పనిచేసే వారికి పెద్ద పీట వేస్తే..నియోజకవర్గాల్లో క్యాడర్‌కు జోష్ వస్తుందని..జనాల్లోకి వెళ్లేందుకు ఈజీ అవుతుందని ఫ్యాన్ పార్టీ పెద్దలు డైరెక్షన్స్ ఇస్తున్నా..నేతలు మాత్రం లేట్‌గా..రియాక్ట్ అవుతున్నారట.
అయితే నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు పూర్తి కాకపోవడంతో.. జిల్లా స్థాయిలో లీడర్లు ఒత్తిడి పెంచుతున్నారట. ఏ నియోజకవర్గంలో ఎన్ని కమిటీలు పూర్తి చేశారనేది ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారట. లేటెస్ట్‌గా రాయలసీమ నుంచి ఇటు గోదావరి జిల్లాల దాకా వైసీపీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాలు చేశారట. ఇందులో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించే చర్చ జరిగిందని అంటున్నారు. కమిటీల నియామకం పూర్తి చేసి..డిజిటలైజేషన్ చేయాలని కూడా లీడర్లకు సూచిస్తున్నారు.
అధికారంలోకి వస్తే అన్ని స్థాయిల్లో నేతలకు అవకాశాలు..
వైసీపీలో ఉన్న ప్రతీ సభ్యుడికీ గుర్తింపు కార్డుని ఇవ్వాలనేది జగన్ నిర్ణయమంటున్నారు. దాంతో క్యాడర్, లీడర్ల పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేసుకుని..భవిష్యత్ అధికారంలోకి వస్తే అన్ని స్థాయిల్లో నేతలకు అవకాశాలు ఇవ్వాలనేది జగన్ ప్లాన్ అంటున్నారు. దాంతో కమిటీల కూర్పు అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది. మరోవైపు కమిటీల ఏర్పాటు..సభ్యత్వ నమోదు తర్వాత వైసీపీ అధినేత జగన్ జిల్లా పర్యటనలు చేస్తారట.
ఇప్పటికే జగన్ జిల్లాల పర్యటన షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉన్నా..కమిటీలు, సభ్యత్వ నమోదును దృష్టిలో పెట్టుకుని కాస్త వెయిట్ చేస్తున్నారట. అందుకే జిల్లాలు, రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ కమిటీల ఏర్పాటుపై స్పెషల్ కాన్సన్‌ట్రేషన్ చేశారని అంటున్నారు. ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ..బూత్ లెవల్‌కు క్యాడర్, లీడర్లను యాక్టీవ్ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కమిటీల ఏర్పాటు పూర్తయ్యేదెప్పుడు.? సభ్యత్వ నమోదు చేపట్టేదెప్పుడు.? జగన్ ఫీల్డ్‌లోకి దిగేదెప్పుడో చూడాలి మరి.
