CM Jagan : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు.. కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతి

కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్న ప్రభుత్వం.. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంది.

CM Jagan : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు.. కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతి

Jagan

CM Jagan : కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చాలా కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. ఇంటిని పోషించే వారు కోవిడ్ తో చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య నియామకాలకు అనుమతి ఇచ్చారు.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్న ప్రభుత్వం.. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంది.

Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి

సామాజిక భద్రత కల్పన చర్యగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నియమించాలంది. కొందరిని గ్రామ/వార్డు సచివాలయాల్లో నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.