Fake Currency : బాబోయ్.. యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్లు తయారీ, రూ.27లక్షల ఫేక్ కరెన్సీ సీజ్

యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు తయారు చేసి వాటిని చెలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27లక్షల విలువైన ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Fake Currency : బాబోయ్.. యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్లు తయారీ, రూ.27లక్షల ఫేక్ కరెన్సీ సీజ్

Fake Currency : టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతోందో, నేరాలు ఘోరాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఆందోళన కలిగించే అంశం. టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో, దాని కారణంగా క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని చెడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కుతున్నారు. అచ్చం కరెన్సీ నోట్లను తలపించే ఫేక్ కరెన్సీ నోట్లు తయారు చేసి డబ్బు సంపాదిస్తున్నారు.

యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు తయారు చేసి వాటిని చెలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27లక్షల విలువైన ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన కస్తూరి రమేశ్ బాబు కారు మెకానిక్ గా పని చేస్తున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఆదాయం సరిపోలేదు. దీంతో అతడి బుద్ధి దారితప్పింది. ఈజీ మనీ కోసం కన్నింగ్ ప్లాన్ వేశాడు. అంతే, నకిలీ కరెన్సీ నోట్లు ప్రింట్ చేయాలని నిర్ణయించాడు.

Also Read..Fake Currency Gang : యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల తయారీ.. హైటెక్ ముఠా అరెస్ట్

నకిలీ కరెన్సీ నోట్లు ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకునేందుకు అతడు యూట్యూబ్ మీద దృష్టి పెట్టాడు. యూట్యూబ్ లో పలు వీడియోలు చూసి ఫేక్ కరెన్సీ నోట్స్ ముద్రించాడు. ఇందుకోసం తన సోదరి రామేశ్వరి సాయం తీసుకున్నాడు. అలా ప్రింట్ చేసిన నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2022లో గోపాలపురం పోలీసులకు చిక్కారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకి పంపారు. ఈ కేసులో రమేశ్ సోదరి రామేశ్వరి బెయిల్ పై బయటకు వచ్చింది. రమేశ్ బాబు జైల్లో ఉండగా.. హసన్ బీ పరిచయం అయ్యింది. హసన్ బీ బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇద్దరూ కలిసి నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ గురించి చర్చించుకున్నారు.

జైటు నుంచి బయటకు రాగానే రమేశ్ బాబు తన కుటుంబాన్ని తాండూరుకు మార్చాడు. నకిలీ నోట్ల ముద్రణకు సంబంధించిన సామాగ్రిని తెచ్చి రూ.500 నకిలీ నోట్లు ప్రింట్ చేశాడు. ఇలా తయారు చేసిన నకిలీ నోట్లను గుజరాత్ కు వెళ్లి చెలామణి చేస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో గుజరాత్ పోలీసులు రమేశ్ ను అరెస్ట్ చేసి గత నెలలో జైలుకి పంపారు.

Also Read..Fake Currency Notes : షాకింగ్.. దేశంలో పెరిగిన దొంగ నోట్లు.. రూ.500 నోట్లే ఎక్కువ

రమేశ్ అరెస్ట్ తర్వాత అతడి సోదరి రామేశ్వరి నకిలీ నోట్ల చెలామణి బాధ్యతను తీసుకుంది. ఈ క్రమంలోనే హసన్ బీని సంప్రదించింది. ప్రింట్ చేసిన నోట్లను చెలామణి చేద్దామని ఒప్పందం కుదుర్చుకుంది. తన నకిలీ నోట్ల డెన్ ను చాంద్రాయణగుట్ట ప్రాంతానికి మార్చింది. ఇద్దరూ కలిసి నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి డెన్ పై దాడి చేశారు. రూ.25లక్షల విలువైన ఫేక్ కరెన్సీ నోట్లు, ల్యాప్ టాప్, ప్రింటర్, నోట్ల తయారీకి వాడే పేపర్ ను స్వాధీనం చేసుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.