Prisoners to Priests: పురోహితులుగా సెంట్రల్ జైల్లో శిక్షణ తీసుకుంటున్న ఖైదీలు

సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు పౌరోహిత్య పాఠాలు నేర్పిస్తూ..శిక్ష అనంతరం వారి జీవితాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు పోలీసులు.

Prisoners to Priests: పురోహితులుగా సెంట్రల్ జైల్లో శిక్షణ తీసుకుంటున్న ఖైదీలు

Bhopal

Prisoners to Priests: వారంతా దారుణమైన నేరాలు చేసిన మనుషులు. క్రూరమైన నేరాలకు ఏళ్లకేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. అయినా వారు కూడా మనుషులే కదా. వారిలోని మానవత్వాన్ని తట్టిలేపితే..చేసిన నేరాలకు ప్రాయోశ్చితంగా మనిషి జన్మకు సార్ధకత చేకూర్చవచ్చని జైలు అధికారులు భావించారు. అందుకే సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు పౌరోహిత్య పాఠాలు నేర్పిస్తూ..శిక్ష అనంతరం వారి జీవితాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు పోలీసులు. భోపాల్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఖైదీలు వైదిక ఆచారాలను నిర్వహించడానికి పాఠాలు నేర్చుకుంటున్నారు. శిక్షణ అనంతరం వారు పురోహితులుగా(పూజారులు) దేవాలయాల్లో పూజలు జరిపించవచ్చు.

Also Read: Telangana : ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కామెంట్స్.. 95-105 స్థానాల్లో గెలుపు, ప్రశాంత్ కిశోర్ బెస్ట్ ఫ్రెండ్

వైదిక కర్మకాండలపై ఆసక్తి ఉండి, శిక్షాకాలం పూర్తయిన తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించాలనుకునే ఖైదీలను ఈ శిక్షణకు ఎంపిక చేశారు జైలు అధికారులు. భోపాల్ లోని ప్రముఖ ఆత్యాద్మిక సంస్థ “గాయత్రీ శక్తిపీఠ్” ఆధ్వర్యంలో సుమారు 50 మంది ఖైదీలకు నెల రోజులపాటు ‘యుగ పురోహిత్’ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ అంశంపై భోపాల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ దినేష్ నర్గావే వార్త సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ గతంలో గాయత్రి శక్తిపీఠ్.. జైల్లోని ఖైదీల ఆధ్యాత్మిక, మేధో, నైతిక అభ్యున్నతి కోసం చాలా కృషి చేసిందని చెప్పారు. జైళ్లలో ఉండే ఖైదీలు డిప్రెషన్ లోనూ లేదా మరింత కఠినంగానూ ఉంటారని అటువంటి వారిలో సామాజికస్పృహను తట్టిలేపి ఇలా వైదిక అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు దినేష్ నర్గావే తెలిపారు.

Also Read: CM KCR : దేశంలో మార్పు అవసరం.. కొత్త జాతీయ పార్టీ రావొచ్చు – సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

ప్రస్తుతం 50-60 మంది ఖైదీలకు శిక్షణ ఇస్తున్నామని తద్వారా ఖైదీలు తమ చుట్టూ ఉన్న సానుకూల శక్తిపై అవగాహన పెంచుకుంటున్నారని సూపరింటెండెంట్ దినేష్ వివరించారు. జైల్లో వైదిక శిక్షణపై హత్య నేరం కింద శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఒకరు స్పందిస్తూ.. మానవుల్లోని దైవత్వాన్ని, పరం పూజ్య సందేశాన్ని ఈ శిక్షణ ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు తాము ఎంతో ఒత్తిడికి గురయ్యేవాళ్లమని, కానీ వైదిక శిక్షణ తర్వాత మనసు ప్రశాంతత సంతరించుకున్నట్లు శిక్షణలో పాల్గొన్న ఖైదీలు వెల్లడించారు.

Also Read:Remarks on Indian Flag: జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు