పంజాబ్ వ్యాపారి ఇంట్లో రక్తపుటేరులు..ఐదు దారుణ హత్యలు..!!

  • Published By: nagamani ,Published On : June 26, 2020 / 10:13 AM IST
పంజాబ్ వ్యాపారి ఇంట్లో రక్తపుటేరులు..ఐదు దారుణ హత్యలు..!!

పంజాబ్ ఓ వ్యాపారి ఇంట్లో గురువారం (జూన్ 25,2020)న  ర‌క్త‌పుటేరులు పారాయి. రతన్ టార్న్ లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న బ్రిజ్ లాల్ (65)ఇంట్లో ఐదుగురు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌నతో స్థానికంగా పెద్ద కలకలం రేగింది. 

బ్రిజ్ లాల్ అనే వ్య‌క్తి.. డ్ర‌గ్స్ వ్యాపారం చేస్తున్నాడు. అక్ర‌మంగా డ్ర‌గ్స్ విక్ర‌యిస్తూంటాడు. బ్రిజ్ లాల్ తో పాటు కుమారుడు దల్జిత్ సింగ్ (22),ఇద్ద‌రు కోడళ్లు జస్‌ప్రీత్ కౌర్ (28), అమన్‌దీప్ కౌర్ (26), బ్రిజ్ లాల్ డ్రైవర్ గుర్సాహిబ్ సింగ్ సాబాలుగా పోలీసులు గుర్తించారు.  

డ్రైవ‌ర్ హ‌త్య‌కు గురికాగా..అతని మ‌నువండ్లు, మ‌న‌వ‌రాళ్లు ప్రాణాల‌తో బ‌ైటపడి హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు. ఈ దారుణం నుంచి బ్రిజ్ లాల్ పెద్ద కొడుకు తప్పించుకున్నాడు. అదే సమయంలో అతను ఇంట్లోనే ఉన్నా..మ‌ద్యం మ‌త్తులో ఉన్న అతన్ని హత్య చేయటానికి వచ్చినవారు గమనించలేదు. దీంతో అతను ప్రాణాలతో బైటపడ్డాడు. 

బుధ‌వారం రాత్రి 11:30 గంట‌ల స‌మ‌యంలో బ్రిజ్ లాల్ త‌న డ్రైవ‌ర్ గుర్సాహిబ్ కు ఫోన్ చేసి ఇంటికి రావాల‌ని చెప్పాడు. దీంతో అత‌ను వెంటనే బ్రిజ్ లాల్ ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే హత్యకు గురయ్యాడు.

కాగా..బుధ‌వారం రాత్రి త‌మ ఇంట్లో గొడ‌వ జ‌రిగింద‌ని, ఆ త‌ర్వాత అంద‌రూ నిద్ర‌పోయారనీ..గురువారం పొద్దునే బ్రిజ్ లాల్ మ‌న‌వ‌రాలు పారి స్థానికులకు భయం భయంగా చెప్పింది. కానీ పారి మాటలను బట్టి ఇంట్లో ఏదో జరగరానిది జరిగిందని అనుమానించిన స్థానికులు బ్రిజ్ లాల్ ఇంటికి చేరుకుని చూడ‌గా.. ఐదుగురి మృత‌దేహాలు ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిసరాలను పరిశీలించారు.

రక్తపు మడుగులో పడి ఉన్నగుర్సాహిబ్ ను గుర్తించిన పోలీసులు..ఇంటినిపరిశీలించగా..ఒక రూమ్ లో బ్రిజ్ లాల్..మరో రూమ్ లో ఓ మృతదేహం..మరో రూమ్ లో రెండు మృతదేహాలు కనిపించాయి. ఇల్లు చోరీకి గురైందని గుర్తించిన పోలీసులు చోరీకి వచ్చినవారు వారిని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఐదు హత్యల ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అయితే ఈ హ‌త్య‌ల‌పై ప‌లు అనుమానాలు వ‌స్తున్నాయి. చోరీ జ‌రిగే కంటే ముందు ఈ హ‌త్య‌లు జ‌రిగాయా? లేక కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా హ‌త్య‌లు జ‌రిగాయా? అనేకోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బ్రిజ్ లాల్ కుమారుడు ఒక‌రు.. మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడు. అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఈ హ‌త్య‌లు స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించాయి. 

ఈ ఘటనలపై పోలీసు అధికారి ధ్రువ్  దహియా మాట్లాడుతూ..బ్రిజ్ లాల్ డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటాడనీ..గతంలో కూడా డ్రగ్స్ బిజినెస్ కేసులో అతని భార్యతో పాటు అరెస్ట్ అయ్యాడని ఈ కేసులోనే బ్రిజ్ లాల్ భార్య  రంజిత్ కౌర్ ఇటువంటి ఆరోపణతోనే అమృతసర్ సెంటర్ జైలులో ఒక సంవత్సరం శిక్ష అనుభవిస్తూ జైలులోనేమరణించిందని తెలిపారు. 

బ్రిజ్ లాల్ మరో ఇద్దరు కుమారులు, బక్షిష్ సింగ్ సోను,పరంజిత్ సింగ్ పమ్మా మాదకద్రవ్యాల బానిసలనీ..ప్రస్తుతం వారు టార్న్ తరన్ లోని డి-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

వ్యాపారి ఇద్దరు కొడుకుల జంటలకు ఒక్కొక్కరు పిల్లలు ఉన్నారని తెలిపారు.ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ జెఎస్ వాలియా తెలిపారు.

Read: తన మేకను ఓ కుక్క కరిచిందని 40 వీధి కుక్కలకు విషం పెట్టి చంపేశాడు