Social Media Fraudsters : చదివింది టెన్త్ క్లాస్… ఆన్‌లైన్ మోసాల్లో మాస్టర్ డిగ్రీ

సోషల్ మీడియా వాడకం పెరిగాక వాటిలో జరిగే మోసాలు కూడా బాగానే పెరిగాయి. చదువుకోని వాళ్లు కూడా వీటి ద్వారా మోసాలు చేయటంలో ఆరితేరారు.

Social Media Fraudsters : చదివింది టెన్త్ క్లాస్… ఆన్‌లైన్ మోసాల్లో మాస్టర్ డిగ్రీ

Rajasthan Fraudsters

Social Media Fraudsters : సోషల్ మీడియా వాడకం పెరిగాక వాటిలో జరిగే మోసాలు కూడా బాగానే పెరిగాయి. చదువుకోని వాళ్లు కూడా వీటి ద్వారా మోసాలు చేయటంలో ఆరితేరారు. ఫేస్ బుక్ , ఓఎల్ ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యుల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాకు చెందిన 12 మంది సభ్యుల ముఠా సైబర్ మోసాలకు పాల్పడుతోంది. వీరిపై హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైదారాబాద్ పోలీసులు రాజస్థాన్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకు వచ్చారు. వీరిని శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచి చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు.

Also Read : SC Railway : పండగ బాదుడు.. పెరిగిన రైలు చార్జీలు


ఈ ముఠా ఓఎల్ఎక్స్ లో వస్తువులు కొంటామని అమాయకులను నమ్మించి బాధితుల ఖాతానుంచి నగదు లాగేసుకున్నారు. ఫేస్ బుక్ హ్యాక్ చేసి ప్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు వసూలు చేసినట్లు కూడా నిందితులుపై  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ ముఠాపై రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోనూ పలు కేసులున్నాయి. ముఠాలోని సభ్యులు చదివింది  టెన్త్ క్లాస్ అయినా సోషల్ మీడియా యాప్ లనువాడకం…. వాటి ద్వాారా మోసాలు చేయటంలో ఆరితేరారని పోలీసులు తెలిపారు.