Realtor Murder : కాల్పుల ఘటనలో గాయపడిన రఘు మృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడా లో ఈరోజు ఉదయం శ్రీనివాస్‌రెడ్డిని హతమార్చింది మట్టారెడ్డి అనే అనుమానం ఉందని మృతుడి ప్రధాన అనుచరుడు కృష్ణ ఆరోపించా

realtor murder
Realtor Murder : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడా లో ఈరోజు ఉదయం శ్రీనివాస్‌రెడ్డిని హతమార్చింది మట్టారెడ్డి అనే అనుమానం ఉందని మృతుడి ప్రధాన అనుచరుడు కృష్ణ ఆరోపించాడు.
గతం నుంచి శ్రీనివాస్‌రెడ్డికి, మట్టారెడ్డికి మధ్య భూవివాదం ఉందని అతను చెప్పాడు. 5 నెలల క్రితం ల్యాండ్ కొన్నారని.. శ్రీనివాస్‌రెడ్డి, రఘురెడ్డి ఇద్దరూ స్నేహితులు కలిసి వెంచర్ డెవలప్ చేస్తున్నారని ఆయన తెలిపాడు. 10ఎకరాల ల్యాండ్ విషయంలో వివాదం నడుస్తోందని కృష్ణ చెప్పాడు.
మొత్తం 22 ఎకరాల వెంచర్‌లో పట్టాదారులకు శ్రీనివాసరెడ్డికి గతంలోనే వివాదం ఉందని… ఇందులో కొంత భాగం నాదని మట్టారెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడని కృష్ణ వివరించాడు. కాగా ఈకేసులో శ్రీనివాసరెడ్డి డ్రైవర్ మహమదుల్లా హఫీజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు. కాగా….. కాల్పుల ఘటనలో బుల్లెట్ తూటా తగిలి బీఎన్ రెడ్డి నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుున్న రఘు కూడా మృతి చెందాడు.