Road Accident: వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఘటన స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Road Accident: వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Road Accident

Updated On : August 16, 2023 / 9:17 AM IST

Warangal Road Accident: వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది.

Road Accident : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీపై డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు

ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా.. మరో ముగ్గురు ప్రయాణీకులు ఆటోలో ఇరుక్కుపోయారు. వీరిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆస్పత్రి వద్ద చికిత్సపొందుతూ ఒకరు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. మధురై సమీపంలో ఢీకున్న కారు, ట్రక్కు

ఈ ప్రమాదంలో మృతులు తేనె విక్రయించే వారిగా స్థానికులు తెలిపారు. తేనెపట్టు అమ్ముకోవడంకోసం వారు ఆటోలో వరంగల్ వైపు నుంచి వర్దన్నపేట వైపుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌కు చెందిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.