Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. మధురై సమీపంలో ఢీకున్న కారు, ట్రక్కు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదంజరిగింది. కారు, కంటైనర్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. మధురై సమీపంలో ఢీకున్న కారు, ట్రక్కు

Tamil Nadu Road Accident

Updated On : July 31, 2023 / 9:55 AM IST

Tamil Nadu : తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో కారు, కంటైనర్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు మదురై ఎస్పీ శివ ప్రసాద్ తెలిపారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విషాద ఘటన సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి

ఇదిలాఉంటే ఆదివారం తెల్లవారుజామునకూడా మధురైలోని మస్తాన్‌పట్టి టోల్ ప్లాజాలో విషాద ఘటన జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో టోల్ ప్లాజా వద్ద మోటార్ సైకిల్ పై వెళ్తున్న సతీష్ కుమార్ అనే వ్యక్తిని ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ ఏపీలోని కాకినాడ నుంచి 30 టన్నుల బియ్యం లోడుతో కేరళకు వెళ్తుంది. లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో గుంటూరుకు చెందిన కె. బాలకృష్ణన్ అనే డ్రైవర్ దానిని అదుపు చేసే ప్రయత్నం చేశాడు. రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడలేదు.

Uttar Pradesh: అయ్యయ్యో పొరబడిన మహిళ..! మతిస్థిమితం లేనివ్యక్తిని భర్త అనుకొని ఇంటికి తీసుకెళ్లింది.. అసలు విషయం తెలిసి..

దీంతో టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న తరువాత ప్లాజా వద్ద వాహనాలను తప్పించే క్రమంలో  మహిళల టోల్ బాత్‌కు ఎదురుగా లారీని మళ్లించాలని డ్రైవర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సతీష్ కుమార్ లారీ దూసుకొచ్చే విషయాన్ని గమనించక పోవటంతో లారీ ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. ఆ తరువాత లారీ వేగంగా వెళ్లి కారును ఢీకొట్టింది. కారులోని ఓ వ్యక్తి, మహిళ టోల్ బాత్ ఉద్యోగిని గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.