Earthquake In Nepal : నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు దుర్మరణం

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలి ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ వెల్లడించింది.

Earthquake In Nepal : నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు దుర్మరణం

earthquake in Nepal

Earthquake In Nepal : నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలి ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని పేర్కొంది.

భూకంపం ధాటికి దోటి జిల్లాలోని గైరాగాన్‌ ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరికొందరు గాయపడ్డారని, ఆస్తినష్టం కూడా సంభవించిందని తెలిపారు. నేపాల్‌లో గత 24 గంటల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. మంగళవారం రాత్రి 8.52 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది.

Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.5గా నమోదు

మళ్లీ 9.41 గంటల సమయంలో 3.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. కాగా, అర్ధరాత్రి సమయంలో వచ్చిన భూకంపంతో ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని గజియాబాద్‌, గురుగ్రామ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కూడా భూమి కంపించింది. దీంతో నిద్రిస్తున్న ప్రజలు ప్రకంపనలతో భయాందోళనలకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.