Ganja Smuggling : దోశ అనుకున్నారా ?…కాదండీ…గంజాయి కొత్త అమ్మకాలు

గంజాయిని దోశలాగా చుట్టి న్యూస్ పేపరులో కట్టి... ఆర్డర్ ఇచ్చిన వారికి డోర్ డెలివరీ చేస్తున్న మలక్ పేటకు చెందిన కిషోర్ సింగ్  అనే వ్యక్తిని  హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్

Ganja Smuggling : దోశ అనుకున్నారా ?…కాదండీ…గంజాయి కొత్త అమ్మకాలు

ganja smuggling

Ganja Smuggling :  పోలీసులు మాదక ద్రవ్యాల రవాణా వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా,  కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో వాటిని వినియోగదారులకు అంద చేస్తూనే ఉన్నారు. గంజాయిని దోశలాగా చుట్టి న్యూస్ పేపరులో కట్టి… ఆర్డర్ ఇచ్చిన వారికి డోర్ డెలివరీ చేస్తున్న మలక్ పేటకు చెందిన కిషోర్ సింగ్  అనే వ్యక్తిని  హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇతడితో పాటు అతనికి సహాయం చేస్తున్న వారి బంధువును కూడా అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల  నిమిత్తం కార్ఖానా పోలీసులకు అప్పగించారు. ఇతనికి ఆదిలాబాద్ కు చెందిన ముఠా సరుకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

ఆదిలాబాద్ కు చెందిన సోనేరావు నుంచి కిషోర్ సింగ్ కిలో రూ. 10 వేలకు గంజాయిని కొనుగోలు చేసేవాడు. దీన్నిరిటైల్ గా రూ. 60 వేలకు అమ్మకం సాగిస్తున్నాడు.  తనకు వచ్చిన గంజాయిని 100 గ్రాముల చొప్పున కిషోర్ సింగ్ దోశలాగా చుట్టి దానిని న్యూస్ పేపర్ లో పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా వినియోగదారులకు అందించేవాడు.

గతంలో కిషోర్ సింగ్ మంగళ్ హాట్ ప్రాంతంలో నివసించే వాడు. అక్కడ అతనిపై పోలీసుల నిఘా పెరగటంతో మలక్ పేట ప్రాంతానాకి మకాం మార్చాడు. ఇక్కడకు వచ్చాక   దోశ లాగ చుట్టి  గంజాయి విక్రయాలు  సాగిస్తూ తన ఫోన్ నెంబర్ కుడా మార్చి… కొత్తనెంబర్ ద్వారా కస్టమర్లను కాంటాక్ట్ చేసి వారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం దోసెలు  లాగా గంజాయి చుట్టి డెలివరీ చేస్తున్నాడు.

గంజాయి డెలివరీ చేయటానికి తమ సమీప బంధువును కరణ్ సింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.గత శనివారం హెచ్ న్యూ అధికారులు సోనేరావుతో పాటు గంజాయి  రవాణా చేసిన ఉల్లాస్ సుకారాం,హరిసింగ్ లను అరెస్ట్ చేశారు.
Also Read : Bhagalpur : బీహార్‌‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
ప్రాధమిక విచారణలో తాము గంజాయిని  ఎలా  తీసుకువస్తున్నారనే దానిపై పొంతనలేని సమాధానాలు చెప్పటంతో పోలీసులు   వారిని తమదైన స్టైల్లో లోతుగా విచారించింది. దీంతో  వారు కారులో తీసుకువస్తున్నట్లు  తెలిపారు.  వీరి ద్వారా మిగిలిన నిందితులను పట్టుకుని తదుపరి  విచారణ నిమిత్తం వీరిని కార్ఖానా పోలీసులకు అప్పగించారు.