Mahesh Bank Case : మహేష్ బ్యాంక్ కేసులో ట్విస్ట్.. బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లకు జైలుశిక్ష

మహేష్ బ్యాంక్ సైబర్ అటాక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్ బ్యాంక్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు శిక్ష విధించింది. 15 రోజుల పాటు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మహేశ్ బ్యాంక్ చైర్మన్ రమేశ్ బంజ్, 10 మంది డైరెక్టర్లకు శిక్ష విధించింది.

Mahesh Bank Case : మహేష్ బ్యాంక్ కేసులో ట్విస్ట్.. బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లకు జైలుశిక్ష

Mahesh Bank Case : మహేష్ బ్యాంక్ సైబర్ అటాక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్ బ్యాంక్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు శిక్ష విధించింది. 15 రోజుల పాటు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మహేశ్ బ్యాంక్ చైర్మన్ రమేశ్ బంజ్, 10 మంది డైరెక్టర్లకు శిక్ష విధించింది.

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఇప్పటివరకూ వ్యక్తుల ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు ఏకంగా బ్యాంక్‌ సర్వర్‌నే హ్యాక్‌ చేశారు. మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12.90 కోట్లు లాగేశారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీులు.. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు కనుగొన్నారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, సైబర్ నేరగాళ్లు డబ్బుని బదిలీ చేసిన ఖాతాలన్నీ ప్రస్తుతం ఫ్రీజ్ అయి ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కోర్టు అనుమతి లేకుండా బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు బ్యాంకు చైర్మన్ తో పాటు 10 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.