Secunderabad : గుండెలు పిండే విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య, ఆ బాధ తట్టుకోలేక..

Secunderabad : అసలే ఆర్థికంగా చితికిపోయారు. దానికి తోడు కుటుంబ పెద్ద చనిపోయారు. దీన్ని తట్టుకోలేకపోయిన కుటుంబసభ్యులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.

Secunderabad : గుండెలు పిండే విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య, ఆ బాధ తట్టుకోలేక..

Secunderabad Tragedy (Photo : Google)

Updated On : June 13, 2023 / 10:24 PM IST

Secunderabad Tragedy : సికింద్రాబాద్ బోయిన్ పల్లి భవానీ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. తండ్రి చనిపోయాడన్న బాధతో తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను విజయలక్ష్మి(తల్లి), చంద్రకళ(కూతురు), సౌజన్య(కూతురు)గా గుర్తించారు.

చంద్రకళ ఎంబీఏ చదువుతోంది. సౌజన్య వికలాంగురాలు. ముగ్గురూ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో సూసైడ్ చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాకు తరలించారు.

ఏప్రిల్ 4న ఇంటి పెద్ద సూర్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. సూర్యనారాయణ ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడ్డ సూర్య నారాయణ.. ఏప్రిల్ 4న మరణించారు. ఆయన కుటుంబం ఆర్థికంగా చికితిపోయింది. సూర్య నారాయణ మరణంతో కుటుంబసభ్యులు బాగా కుంగిపోయారు.

Also Read..Cyber Criminals : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి.. రూ. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ఈ క్రమంలో దశ దిన కర్మ తర్వాత ఏప్రిల్ 16న సూర్య నారాయణ భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన బంధువులు, స్థానికులు వారిని కాపాడారు. కాగా, నిన్న రాత్రి తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి విజయలక్ష్మి రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు, భర్త చనిపోయిన కారణంగానే మనస్థాపంతో చనిపోతున్నాం అని సూసైడ్ లెటర్ లో విజయలక్ష్మి రాసినట్లు పోలీసులు తెలిపారు.

అసలే ఆర్థికంగా చితికిపోయారు. దానికి తోడు కుటుంబ పెద్ద చనిపోయారు. దీన్ని తట్టుకోలేకపోయిన కుటుంబసభ్యులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అయ్యో పాపం అని కంటతడి పెట్టారు. ఇలాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదని అంటున్నారు.

Also Read..Uttar Pradesh: మోదీ-యోగీ రాజకీయాలపై చర్చ.. కారుతో ఢీకొట్టి చంపిన డ్రైవర్