Oxygen Cylinder Blast : బాబోయ్.. బాంబులా పేలిన ఆక్సిజన్ సిలిండర్, ఇద్దరు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ బాంబులా పేలింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. చందౌలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట ఈ ప్రమాదం జరిగింది.

Oxygen Cylinder Blast : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ బాంబులా పేలింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. చందౌలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి ఆసుపత్రి భవనం అద్దాలు, చుట్టుపక్కల ఇళ్లకున్న అద్దాలు ముక్కలయ్యాయి. ఇద్దరి మృతదేహాలు చెల్లా చెదురుగా రోడ్డు మీద పడ్డాయి. అక్కడంతా భయానక వాతావరణం నెలకొంది. ఓ ట్రక్ లో ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని ఆసుపత్రికి వచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్పాట్ కి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు పేలుడికి కారణం ఏంటో కనిపెట్టే పనిలో పడ్డారు.
ముఘల్ సరాయ్ నగరంలోని రవి నగర్ ప్రాంతంలోని దయాల్ ఆసుపత్రి బయట ఈ పేలుడు జరిగింది. ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య పేలుడు సంభవించింది. ఆసుపత్రి బయట ఆక్సిజన్ సిలిండర్లతో కూడిన ట్రక్కును పార్క్ చేసి ఉంచారు. అందులోంచి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లి ఆసుపత్రిలో పెడుతున్నారు. అదే సమయంలో సడెన్ గా ఓ ఆక్సిజన్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆక్సిజన్ సిలిండర్ల కంపెనీ సిబ్బంది ఇద్దరు మరణించారు.
ఈ పేలుడుతో ఆసుపత్రి సిబ్బంది, చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ఆక్సిజన్ సిలిండర్ బాంబులా పేలిందని తెలుసుకుని షాక్ అయ్యారు. పేలుడికి కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సిలిండర్లను సరిగా రీఫిల్లింగ్, ప్యాకింగ్ చేశారో లేదో చెక్ చేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.