36 Life Sentences for Rapists : రేపిస్టుకి 36 యావజ్జీవ శిక్షలు విధించిన కోర్టు .. 48 అత్యాచారాలు, 71 లైంగిక నేరాలకు పాల్పడిన మాజీ పోలీసు అధికారి

చేసేది పోలీసులు ఉద్యోగం. చేసేవన్నీ దారుణమైన నేరాలు. కరడు కట్టిన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మాజీ పోలీసు అధికారికి లండన్ కోర్టు ఒకటీ రెండూ కాదు ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది లండన్ లోని కోర్టు. 12మంది మహిళలపై అత్యాచారాలు,71 లైంగిక నేరాలకు పాల్పడిన మాజీ పోలీసు అధికారికి 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు భారతీయ సంతతి వ్యక్తి న్యాయమూర్తి.

36 Life Sentences for Rapists : రేపిస్టుకి 36 యావజ్జీవ శిక్షలు విధించిన కోర్టు .. 48 అత్యాచారాలు, 71 లైంగిక నేరాలకు పాల్పడిన మాజీ పోలీసు అధికారి

36 Life Sentences for Rapists

36 Life Sentences for Rapists : చేసేది పోలీసులు ఉద్యోగం. చేసేవన్నీ దారుణమైన నేరాలు. కరడు కట్టిన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మాజీ పోలీసు అధికారికి లండన్ కోర్టు ఒకటీ రెండూ కాదు ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది. 12మంది మహిళలపై అత్యాచారాలు,71 లైంగిక నేరాలకు పాల్పడిన మాజీ పోలీసు అధికారికి 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించిన న్యాయమూర్తి ‘బాబీ చీమా గ్రమ్’ భారతీయ సంతతి వ్యక్తి కావటం విశేషం.

బ్రిటన్‌లోని అతిపెద్ద పోలీసు దళమైన మెట్‌లో దీర్ఘకాలంగా పనిచేసిన 48 ఏళ్ల డేవిడ్ కారిక్ మహిళలపై అత్యాచారం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2003 నుంచి 2020 వరకు 12 మంది మహిళలపై అత్యాచారం చేసి..వారిని అత్యంత క్రూరంగా హింసించాడు. ఇంతటి దారుణమైన వ్యక్తి సమాజంలో జీవించదగినవాడు కాదని అతను మహిళలకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని న్యాయమూర్తి తీర్పు సమయంలో వ్యాఖ్యానించారు. కారిక్ మొత్తంగా 48 అత్యాచారాలు సహా 71 లైంగిక నేరాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో మహిళల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన వ్యక్తికి 36 జీవిత కాల కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు లండన్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి..

ఈ నేరాలన్నీ నిరూపించబడటంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. దోషికి ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో ఇక కారిక తన జీవితం అంతా జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఒకవేళ పెరోల్ కావాలంటే 30 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాతే అనుమతి ఉంటుందని తేల్చి చెప్పారు.

కాగా..కారిక్ ఎంపీలు,విదేశీ దౌత్యవేత్తలను రక్షించే ఒకే సాయుధ విభాగంలో పనిచేసేవాడు. మహిళలను అంత్యంత చులకనగా చూసేవాడు. దారుణమైన పదజాలంతో దూషించేవాడు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాదు వారిని నగ్నంగా చేసి తాళ్లతో కట్టి వారిపై మూత్రం పోసేవాడు. కొరడాలతో కొట్టేవాడు. వారు బాధతో విలవిల్లాడుతుంటే ఆనందం పొందేవాడు. పోలీసు డ్యూటీ చేసే రోజుల్లోనే ఇటువంటి నేరాలకు పాల్పడేవాడు. కారిక్ చేసే దారుణాలకు సంబంధించి ఫిర్యాదులు అందినా .. ఏనాడు క్రమశిక్షణ విచారణను ఎదుర్కోలేదు. ఇలా పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో కారిక్ మహిళలపై మరింతగా రెచ్చిపోయి అత్యంత దారుణంగా అత్యాచారాలు చేయటం హింసించటం చేసేవాడు. కానీ ఎల్లకాలం ఆటలు సాగవు అన్నట్లుగా కారిక్ పాపం పండింది. నమోదు అయిన కేసులు విచారణ జరిగి ఎట్టకేలకు ఈ రేపిస్టుకు 36 యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.