Shaktimaan : శక్తి‌మాన్ లా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి-పోలీసుల హెచ్చరిక

ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వ్యక్తి  కదులుతున్న లారీ మీద నిలబడి విన్యాసాలు చేసి లారీ మీద నుంచి కిందపడి గాయాల పాలయ్యాడు. దీంతో పోలీసులు ఆ వీడియోను  పోస్ట్ చేస్తూ శక్తిమాన్ లాగా వ్యవహరించవద్దని సూచించారు.

Shaktimaan  : శక్తి‌మాన్ లా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి-పోలీసుల హెచ్చరిక

Lucknow Shakthiman

Shaktimaan : స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక,  మినీ  వీడియో  యాప్ లు ప్లే స్టోర్ లో దొరకటంతో చాలామంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా చేసే వీడియోలలో రిస్క్  చేస్తున్న వీడియోలు కూడా ఉంటున్నాయి.  ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వ్యక్తి  కదులుతున్న లారీ మీద నిలబడి విన్యాసాలు చేసి లారీ మీద నుంచి కిందపడి గాయాల పాలయ్యాడు. దీంతో పోలీసులు ఆ వీడియోను  పోస్ట్ చేస్తూ శక్తిమాన్ లాగా వ్యవహరించవద్దని సూచించారు.

ఉత్తర ప్రదేశ్  పోలీసు అధికారి శ్వేతా శ్రీ వాస్తవ   ట్విట్టర్ లో ఆదివారం ఒక వీడియోను పోస్టు చేశారు. ఇందులో ఒక యువకుడు చెత్త తీసుకు  వెళ్లే లారీ ఎక్కి శక్తి‌మాన్ తరహాలో విన్యాసాలు చేశాడు. కదులుతున్న గార్బేజ్ వాహనంపై   పుషప్స్  తీశాడు. అనంతరం కదులుతున్న వాహనం మీదే   నిలబడి ఫోజులిచ్చాడు.  ఇంతలో అనుకోని ప్రమాదం సంభవించింది.  లారీ మలుపు తీసుకునేటప్పుడు  అదుపు తప్పి దానిపై నుంచి రోడ్డుపై పడ్డాడు.

అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఆ గాయాలైన ఫోటోలు కూడా  పోలీసులు వీడియోలో ఉంచారు.  గత శనివారం రాత్రి లక్నోలోని   గోమతినగర్ లో ఈ ఘటన చోటు  చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు శక్తిమాన్ కావాలనుకున్నాడు. కానీ కొద్ది రోజుల పాటు కనీసం కూర్చోలేడు.  దయచేసి అలాంటి  ప్రమాదకరమైన విన్యాసాలు చేయవద్దని పోలీసులు అందులో హెచ్చరించారు.

ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడికి  భారీగా జరిమానా విధించాలని కొందరు డిమాండ్ చేయగా… యువకుడి ప్రమాదకర స్టంట్లపై   మరికొందరు మండి పడ్డారు. మరో వైపు లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు సిధ్ధమవుతున్నారు.