Youngster Kill Man : ఛత్తీస్ గఢ్ లో దారుణం.. వ్యక్తిని హత్య చేసి, మృతదేహం పక్కనే అతని భార్యపై అత్యాచారం

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేశారు. నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని జైలుకు తరలించారు.

Youngster Kill Man : ఛత్తీస్ గఢ్ లో దారుణం.. వ్యక్తిని హత్య చేసి, మృతదేహం పక్కనే అతని భార్యపై అత్యాచారం

youngster kill man

Updated On : August 4, 2023 / 9:02 PM IST

Youngster Kills Man And Raped His Wife : ఛత్తీస్ గఢ్ లో ఘోరం జరిగింది. ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వ్యక్తిని హత్య చేసి మృతదేహం పక్కనే అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సుర్గుజా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబికాపూర్ కు చెందిన సుఖ్ లాల్(42) సోమవారం రాత్రి  భార్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కార్తీక్(21) అర్ధరాత్రి ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.

గమనించిన సుఖ్ లాల్ నిద్ర నుంచి లేచాడు. కార్తీక్ ను చూసిన సుఖ్ లాల్ తన భార్యతో యువకుడికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఆగ్రహించిన కార్తీక్ కర్రతో సుఖ్ లాల్ తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో అతడు మృతి చెందాడు. అనంతరం కార్తీక్.. సుఖ్ లాల్ భార్యను బెదిరించాడు.

Amanchi Krishna Mohan : పోలీసులతో చంద్రబాబు కేసులు పెట్టించారు.. అప్పుడు నేను టీడీపీలోనే ఉన్నా

రక్తపు మడుగుల్లో ఉన్న భర్త మృతదేహం పక్కనే ఆమెపై కార్తీక్ అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేశారు. నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని జైలుకు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.