IACS Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు

మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ సైన్స్‌ కు సంబంధించి తొలుత మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. తరవాత పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. దీనినే ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ - పీహెచ్‌డీగా పరిగణిస్తారు.

IACS  Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు

Stump Of Tree Felled Section Of The Trunk Wood Texture Background

IACS Integrated Programs : కోల్‌కతాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఏసీఎస్‌) విభాగాల్లో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. బ్యాచిలర్స్‌ మాస్టర్స్‌, మాస్టర్స్‌ ఇంటిగ్రేటెడ్‌ , మాస్టర్స్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సైన్స్‌ కు సంబంధించి ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు ఉంటుంది. సెమిస్టర్‌ విధానంలో బోధన కొనసాగుతుంది. మొదటి మూడు సెమిస్టర్లలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టులకు సంబంధించిన ఫౌండేషనల్‌ కోర్సులు ఉంటాయి. తరవాత నాలుగో సెమిస్టర్‌ నుంచి పై సబ్జెక్టులలో ఒకదాని మేజర్‌ సబ్జెక్టుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏడో సెమిస్టర్‌ నుంచి రిసెర్చ్‌ కోర్సులు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే వారి అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్‌ స్ట్రీమ్‌లో ఇంటర్‌, పన్నెండోతరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విషయానికి సంబంధించి యూజీ ప్రీ ఇంటర్వ్యూ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ప్రకారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 50 మందిని ఎంపిక చేస్తారు. కేవీపీవై ఫెలోషిప్‌ అర్హత పొందిన అభ్యర్థులను వారి ర్యాంక్‌ ప్రకారం నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ కేటగిరీ ద్వారా పదిమందికి అడ్మిషన్స్‌ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ సంస్థ నిబంధనల ప్రకారం నాలుగో సెమిస్టర్‌ నుంచి ప్రతినెలా స్టయిపెండ్‌ చెల్లిస్తారు.

మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ సైన్స్‌ కు సంబంధించి తొలుత మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. తరవాత పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. దీనినే ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ – పీహెచ్‌డీగా పరిగణిస్తారు. సంస్థ నిబంధనల ప్రకారం జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ఇస్తారు. స్పెషలైజేషన్‌లకు సంబంధించి కెమికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, మెటీరియల్స్‌ సైన్సెస్‌, మేథమెటికల్‌ అండ్‌ కంప్యూటేషనల్‌ సైన్సెస్‌, అప్లయిడ్‌ అండ్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్సెస్‌ ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ప్రథమ శ్రేణి మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మేథమెటికల్‌ అండ్‌ కంప్యూటేషనల్‌ సైన్సెస్‌ స్పెషలైజేషన్‌కు ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

అభ్యర్థులను మాస్టర్స్‌ ప్రీ ఇంటర్వ్యూ స్క్రీనింగ్‌ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష లో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. స్పెషలైజేషన్‌కు 20 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ మొదటి రెండేళ్లు నెలకు రూ.12,000ల స్టయిపెండ్‌ ఇస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్‌ అభ్యర్థులకు రూ.1200, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.iacs.res.in పరిశీలించగలరు.