B.TECH అర్హత: BHELలో అప్రెంటీస్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : March 25, 2020 / 06:27 AM IST
B.TECH అర్హత: BHELలో అప్రెంటీస్ ఉద్యోగాలు

భారత్ హేవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లామా అప్రెంటీస్ ల్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 229 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 3 , 2020 తో ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విభాగాల వారీగా ఖాళీలు :

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 

కెమికల్ ఇంజనీరింగ్ – 1
సివిల్ ఇంజనీరింగ్ – 3
కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ – 4
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 43
ఎలక్ట్రికల్ అండ్ ఎక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 3
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ – 13
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ – 7
ఇన్ఫ్ ర్మేషన్ టెక్నాలజీ – 1
ఇన్ స్ట్రూమెంటేషన్ టెక్నాలజీ – 1
మెకానికల్ ఇంజనీరింగ్ – 60
మెటల్లార్జీ -2

డిప్లామా అప్రెంటీస్ 

సివిల్ ఇంజనీరింగ్ – 5
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 24
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ – 2
మెకానికల్ ఇంజనీరింగ్ – 40
మోడరన్ ఆఫీసర్ Mgmt – 20

విద్యార్హత : అభ్యర్దులు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్, ఇంటర్వూ  ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 3, 2020.