CUET PG 2024 Result Out : సీయూఈటీ పీజీ 2024 ఫలితాలు విడుదల.. సబ్జెక్ట్ వారీగా అత్యధిక మార్కులు!

CUET PG 2024 Result Out: సీయూఈటీ పీజీ - 2024 స్కోర్‌ల ఆధారంగా మొత్తం 190 యూనివర్శిటీలో ప్రవేశాన్ని పొందవచ్చు.

CUET PG 2024 Result Out : సీయూఈటీ పీజీ 2024 ఫలితాలు విడుదల.. సబ్జెక్ట్ వారీగా అత్యధిక మార్కులు!

CUET PG 2024 Result Out: Check Highest Marks In Major Subjects

CUET PG 2024 Result Out : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG) 2024 ఫలితాలను ప్రకటించింది. ఈ స్కోర్‌లతో పాటు ఎన్‌టీఏ సీయూఈటీ-PG 2024లో మొత్తం 157 సబ్జెక్టులకు సబ్జెక్ట్ వారీగా టాపర్‌లను కూడా రిలీజ్ చేసింది. సీయూఈటీ-పీజీ వెబ్‌సైట్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో అత్యధిక మార్కులను చెక్ చేయవచ్చు. సీయూఈటీ-పీజీ 2024లో కొన్ని ప్రధాన సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించారు.

  • సీఓక్యూపీ03 బీఈడీ- 187
  • సీఓక్యూపీ11 జనరల్ (ఎల్ఎల్బీ )- 285
  • సీఓక్యూపీ12 జనరల్ (ఎంబీఏ)- 295
  • సీఓక్యూపీ17 మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం-296
  • హెచ్‌యూక్యూపీ08 జీగ్రాఫీ-247
  • హెచ్‌యూక్యూపీ09 హిస్టరీ- 232
  • హెచ్‌యూక్యూపీ18 పొలిటికల్ సైన్స్- 270
  • ఎల్ఏక్యూపీ01 ఇంగ్లీష్-225
  • ఎల్ఏక్యూపీ02 హిందీ-271
  • ఎంటీక్యూపీ04 డేటా సైన్స్- 207
  • ఎస్‌సీక్యూపీ07 బోటనీ- 207
  • ఎస్‌సీక్యూపీ08 కెమిస్ట్రీ- 257
  • ఎస్‌సీక్యూపీ19 గణితం- 265
  • ఎస్‌సీక్యూపీ24 భౌతికశాస్త్రం- 246
  • ఎస్‌సీక్యూపీ28 జువాలజీ- 208

మొత్తం 190 యూనివర్శిటీలు సీయూఈటీ (పీజీ) 2024 స్కోర్‌ల ఆధారంగా అడ్మిషన్‌ను అందిస్తాయి. ఇందులో దాదాపు 39 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 15 ప్రభుత్వ సంస్థలు, 30 రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీలు, 97 ఇతర, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలు ఉన్నాయి. సీయూఈటీ స్కోర్‌ల ఆధారంగా ప్రవేశాలను నిర్వహించే యూనివర్శిటీల పూర్తి జాబితాను సీయూఈటీ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.

Read Also : Agniveer Exam Admit Cards : అగ్నివీర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!