BPCL : బీపీసీఎల్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం లిమిటెడ్)..ప్రభుత్వ రంగ చమురు సంస్థ. ఇందులో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది.

10TV Telugu News

BPCL Recruitment 2021  : బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం లిమిటెడ్)..ప్రభుత్వ రంగ చమురు సంస్థ. ఇందులో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఇవ్వనున్నారు. 2021, సెప్టెంబర్ 21వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 87 పోస్టులున్నాయి. ఇందులో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ముంబైలోని బీపీసీఎల్ రిఫైనరీలో ఏడాది పాటు శిక్షణ అందివ్వనున్నారు.

Read More : Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 42 (కెమికల్ 11, ఐటీ 3, ఎలక్ట్రికల్ 5, సివిల్ 8, మెకానికల్ 13, ఇన్ స్ట్రుమెంటేషన్ 2).
టెక్నీషియన్ అప్రెంటిస్ 45 (కెమికల్ 5, ఎలక్ట్రికల్ 8, సివిల్ 7, ఇన్ స్ట్రుమెంటేషన్ 8, మెకానికల్ 17)
అర్హత : సంబంధిత బ్రాంచీ లేదా ట్రేడ్ లో బీటెక్, బీఈ, డిప్లామా చేసి ఉండాలి.
2019 తర్వాత ఉత్తీర్ణులై 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టంబర్ 21.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో.
స్టయిఫండ్ : రూ. 25 వేలు, రూ. 18 వేలు.
వెబ్ సైట్ :  http://www.bharatpetroleum.in/

10TV Telugu News